12 ఏళ్ల 'జై చిరంజీవ'

  • IndiaGlitz, [Thursday,December 21 2017]

జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి, చూడాల‌ని ఉంది, ఇంద్ర వంటి హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత మెగాస్టార్ చిరంజీవి, టాప్ ప్రొడ్యూస‌ర్ సి.అశ్వ‌నీద‌త్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం జై చిరంజీవ‌. అలాగే స్వ‌యంవ‌రం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్‌, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి సూప‌ర్ హిట్స్ త‌రువాత ద‌ర్శ‌కుడు కె.విజ‌య్ భాస్క‌ర్, మాట‌ల ర‌చ‌యిత త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రమిది. ఇలాంటి కాంబినేష‌న్‌లలో సినిమా అంటే ఆ చిత్రంపై ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అయితే ఆ అంచ‌నాలు అందుకోవ‌డంలో ఈ సినిమా పూర్తి స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయినా.. కామెడీ ప‌రంగా జై చిరంజీవ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రంలో చిరంజీవి కామెడీ టైమింగ్ అదుర్స్ అనే చెప్పాలి. సునీల్‌, వేణు మాధ‌వ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్స్‌.. ద్వితీయార్థంలో బ్ర‌హ్మానందంతో వ‌చ్చే కామెడీ సీన్స్‌లోనూ చిరు అద‌రగొట్టేశారు. ఇక డ్యాన్స్‌ల విష‌యంలోనూ మ‌రోసారి రాణించారు చిరు. మ‌ణిశ‌ర్మ సంగీత‌మందించిన ఈ సినిమాలోని పాట‌లు చిరు అభిమానుల‌ను అల‌రించాయి. భూమిక‌, స‌మీరా రెడ్డి క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 21, 2005న విడుద‌లైంది. అంటే.. నేటితో ఈ సినిమా విడుద‌లై 12 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతోంద‌న్న‌మాట‌.

More News

సాయిపల్లవి కల నెరవేరినట్టే

కలలు అందరూ కంటారు.అయితే..కొన్ని కలలు మాత్రమే సాకారం అవుతాయి.

సూర్య తో జత కడుతున్న సాయి పల్లవి

సూర్య హీరోగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న తాజా చిత్రం సంకాంతికి ప్రారంభం కానుంది. ఇది సూర్య 36వ సినిమా. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేశారు.

బిల్‌గేట్స్ ప్రశంసలు పొందిన భారతీయ చిత్రం

ఈ మధ్య ఇండియన్ సినిమాల్లో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్ ప్రధానంగా ఉండే సినిమాలు రూపొందుతున్నాయి. అటువంటి సినిమాల్లో అక్షయ్‌కుమార్, భూమి పెడ్నేకర్ నటించిన 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' ఒకటి.

హాలీవుడ్ సినిమా ఆధారంగా 'హ‌లో'?

అక్కినేని అఖిల్ రీ లాంచ్ మూవీగా తెర‌కెక్కిన చిత్రం హ‌లో. ఇష్క్‌, మ‌నం, 24.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర‌లో షాహిద్‌

అర్జున్ రెడ్డి.. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన తెలుగు చిత్ర‌మిది. ఈ చిత్రంతో యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా మారాడు. ఇక ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కూడా అగ్ర క‌థానాయ‌కుల దృష్టిలో ప‌డ్డాడు.