అర్జున్ సురవరం ప్రి రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగా స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
అర్జున్ సురవరం ... క్రైమ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 29న రిలీజ్ కానుంది. నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని భావిస్తోంది చిత్ర యూనిట్. ట్రైలర్ తో సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోగా... అదే జోరుతో భారీ కలెక్షన్లు సాధించడం ఖాయమని అంటోంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు అవ్వగా... ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించింది.
సైరా సినిమాతో మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ ... అర్జున్ సురవరం ప్రి రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రావడం పై సినిమా యూనిట్ పాజిటివ్ వైబ్రేషన్ తో ఉంది. ఈ మధ్యే బిగ్ బాస్ త్రీ సీజన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరు... కింగ్ నాగార్జున తో కలిసి అభిమానులని మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు కూడా చిరు ముఖ్య అతిథిగా హాజరైతే సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని... ఆటోమాటిక్ గా మెగా ఫ్యాన్స్ నుంచి మద్దతు కలిగి వసూళ్లు పెరుగుతాయని అనుకుంటోంది. స్వామి రారా, కేశవ లాంటి చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న నిఖిల్ కు... అర్జున్ సురవరం సినిమా ఇండస్ట్రీ లో నిఖిల్ స్టామినాను పెంచేలా ఉంటుందని చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com