కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో చిరు?

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

మిర్చి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన ర‌చ‌యిత కొర‌టాల శివ‌.. తొలి ప్ర‌యత్నంలోనే విజ‌యం అందుకున్నారు. అంతేగాకుండా.. ఆ త‌రువాత వ‌చ్చిన శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ తోనూ స‌క్సెస్‌ల‌ను అందుకుని హ్యాట్రిక్  అందుకున్నారు.

అలాగే తాజాగా విడుద‌లైన భ‌ర‌త్ అనే నేనుతోనూ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకున్నారు. త‌న త‌దుప‌రి చిత్రంగా.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే.. భ‌ర‌త్ అనే నేనుని ప్ర‌శంసించిన ప్ర‌ముఖుల‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక‌రు. ఈ సినిమా త‌న‌కు బాగా న‌చ్చింద‌ని.. ముఖ్యంగా ప్రెస్ మీట్ సీన్‌కు క్లాప్స్ కొట్టాన‌ని చిరు చెప్పుకొచ్చారు. అలాంటి చిరు.. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల‌తో ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి.

త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్ మూవీకి సంబంధించిన ప్రాజెక్ట్ పై క్లారిటీ వ‌స్తుంది. ప్ర‌స్తుతం చిరు త‌న 151వ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డితో బిజీగా ఉన్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.