ముందుగానే చిరు....
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 శరవేగంగా చిత్రీకరణను జరుపకుంటుంది. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా సమాంతరంగా జరగుతున్నాయి. బిజినెస్ కూడా పూర్తయ్యింది. శాటిలైట్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడైపోయాయి. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పుడు సినిమాను రెండు రోజులు ముందుగా సంక్రాంతి సెలవుల దృష్ట్యా జనవరి 11న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
తమిళ చిత్రం కత్తి రీమేక్‌గా రూపొందుతోన్న ఖైదీ నంబర్ 150లో తెలుగు ఆడియెన్స్ అభిరుచికి తగిన విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేస్తున్నాడు దర్శకుడు వి.వి.వినాయక్. చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో రైతు సమస్యలపై తెరకెక్కుతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. లక్ష్మీరాయ్ స్పెషల్ సాంగ్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com