దోశ తిరగేసిన మెగాస్టార్..

మెగాస్టార్ ఏంటి.. దోశ తిరగేయడమేంటనుకుంటున్నారా? ఇది అక్షరాలా.. నిజం. ప్రముఖ ఓటీటీ 'ఆహా' కోసం కథానాయిక సమంత నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'సామ్ జామ్'‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం పలువురు సెలబ్రిటీలను సమంత ఇంటర్వ్యూ చేస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా సమంత మెగాస్టార్ చిరంజీవిని కూడా ఇంటర్వ్యూ చేసింది. ఈ షోలో చిరు చేసిన సందడికి సంబంధించిన ప్రోమోలను ‘ఆహా’ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ షోకి హైప్‌ను క్రియేట్ చేస్తోంది.

అటు స్టార్ హీరో.. ఇటు స్టార్ హీరోయిన్.. ఇద్దరూ కలిసి షోని అదరగొట్టేశారు. బిగ్‌బాస్ ఫినాలే చూసిన వాళ్లందరికీ మెగాస్టార్ ఏ రేంజ్‌లో రచ్చ చేయగలరో అర్థమైపోయింది. స్పాంటీనియస్ పంచ్‌లతో అదరగొట్టేశారు. తాజాగా ‘సామ్ జామ్’ విడుదల చేసే షోలోను మెగాస్టార్ ఓ రేంజ్‌లో సందడి చేసినట్టు తెలుస్తోంది. తాజాగా షోకి సంబంధించిన పూర్తి ప్రోమో బయటకు వచ్చింది. సమంతతో కలిసి చిరంజీవి చేసిన సందడిని ప్రోమోలో చూపించారు. సమంత అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు చిరు సమాధానాలిచ్చారు. కళ్లకు గంతలు కట్టుకుని దోశను తిరగేశారు. ఒక అంగవైకల్యమున్న బాబు గీసిన తన బొమ్మను చూసి ఫిదా అయిపోయారు.