సినీ కార్మికులకు చిరంజీవి భారీ విరాళం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ అవ్వడంతో టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు మొదలుకుని రిలీజ్‌లు కూడా ఆగిపోయాయి. దీంతో సినీ కార్మికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇంకొందరు రోజువారి కార్మికులు, అల్పాదాయ వర్గాల వారైతే పూట గడవని క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌లో ప్రస్తుతం ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. వారికి అండగా ఉండేందుకు ముందుకొచ్చారు. ఆపద, విపత్కర పరిస్థితుల్లో ముందుకొచ్చి మంచి మనసు చాటుకునే మెగాస్టార్.. కార్మికుల కోసం కోటి రూపాయిలు విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. తాను ఇచ్చే ఈ కోటి రూపాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీపై ఆధారపడిన కార్మికులకు ఉపకరిస్తుందని భావిస్తున్నట్లు చిరు తెలిపారు. కాగా.. చిరు తీసుకున్న ఈ నిర్ణయంతో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, మెగాభిమానులు, సినీ ప్రియులు, నటీనటులు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మెగా ఫ్యామిలీ కూడా..
ఇదిలా ఉంటే.. ఇప్పటికే కరోనా మమమ్మారిపై యుద్ధం చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తూ మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కోటి రూపాయిలు, పీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయిలు .. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి కలిపి 70 లక్షల రూపాయిలు విరాళంగా ఇస్తున్నట్లు చెర్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇలా ప్రభుత్వాలకు ఆర్థిక సాయం ప్రకటించగా.. మెగాస్టార్ అలా.. కార్మికులకు చేయూతగా కోటి రూపాయిలు విరాళం ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com