Chiranjeevi:పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి హాట్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు కోసం సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేస్తారని జోరుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా చిరంజీవి స్పందించారు.
పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు. పిఠాపురానికి తాను రావాలని కల్యాణ్ కోరుకోడన్నారు. కల్యాణ్ బాబు ఎప్పుడూ బాగుండాలని... జీవితంలో తాను అనుకున్నవి సాధించాలని కోరుకుంటానని పేర్కొన్నారు. తమ్ముడు రాజకీయంగా ఎదగాలని తమ కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందని వెల్లడించారు. అలాగే దివంగత నటుడు, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ఆలోచించాలని చిరంజీవి కోరారు. అలాగే ప్రస్తుతం తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా దూరమైనట్లు స్పష్టత వచ్చింది.
కాగా గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు హైదరాబాద్ చేరుకున్న చిరంజీవిని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియా పలకరించింది. దీంతో ఆయన మాట్లాడుతూ . పద్మవిభూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉందని.. డైరెక్టర్స్, నిర్మాతలు, టెక్నీషియన్స్ అందరి వల్లే తనకు పద్మవిభూషన్ వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments