Chiranjeevi:పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి హాట్ కామెంట్స్

  • IndiaGlitz, [Friday,May 10 2024]

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గెలుపు కోసం సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేస్తారని జోరుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా చిరంజీవి స్పందించారు.

పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు. పిఠాపురానికి తాను రావాలని కల్యాణ్ కోరుకోడన్నారు. కల్యాణ్ బాబు ఎప్పుడూ బాగుండాలని... జీవితంలో తాను అనుకున్నవి సాధించాలని కోరుకుంటానని పేర్కొన్నారు. తమ్ముడు రాజకీయంగా ఎదగాలని తమ కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందని వెల్లడించారు. అలాగే దివంగత నటుడు, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ఆలోచించాలని చిరంజీవి కోరారు. అలాగే ప్రస్తుతం తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా దూరమైనట్లు స్పష్టత వచ్చింది.

కాగా గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు హైదరాబాద్ చేరుకున్న చిరంజీవిని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియా పలకరించింది. దీంతో ఆయన మాట్లాడుతూ . పద్మవిభూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉందని.. డైరెక్టర్స్, నిర్మాతలు, టెక్నీషియన్స్ అందరి వల్లే తనకు పద్మవిభూషన్ వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు.

More News

Pawan:జగన్‌కు ఓటమి అర్థమైంది.. అందుకే బేల మాటలు: పవన్

సీఎం జగన్‌కు ఓటమి అర్థమైందని.. అందుకే ఆయన నోటి నుంచి బేల మాటలు వస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు.

R. Krishnaiah:టీడీపీ నేతల అరాచకం.. బీసీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్యపై రాళ్ల దాడి

టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓడిపోతున్నామని తెలిసి నిస్సహాయతతో వైసీపీ నేతలపై హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు.

AP Schemes: ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. పథకాల నిధుల విడుదలకు హైకోర్టు అనుమతి

ఏపీ ఎన్నికల వేళ చర్చనీయాంశమైన సంక్షేమ పథకాల నిధుల విడుదలపై రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

'సత్య' మూవీ అచ్చమైన తెలుగు సినిమాగా ఉంటుంది: నిర్మాత శివమల్లాల

తమిళంలో హిట్ కొట్టిన 'రంగోలి' మూవీ తెలుగులో మే 10న 'సత్య'గా విడుదల కాబోతోంది. హమరేష్, ప్రార్ధన జంటగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన రంగోలి సినిమాని

Chiranjeevi: పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి.. చరణ్‌ భావోద్వేగం..

నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అందుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. తన నటన, డ్యాన్సులు, సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది అభిమానుల మనసు సొంతం చేసుకున్నారు.