అభిమానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల సాయం
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఎంత ప్రయారిటీ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టంలో ఉన్నానని ఆయనకు తెలియజేస్తే చాలు.. వెంటనే ఆయన ఆదుకునేందుకు ముందుకు వస్తారు. ఇప్పటికే చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరికో మెగాస్టార్ సేవలందిస్తున్నారు. కష్టాల్లో ఉన్నానని అయన తలుపు తడితే చాలు.. వెంటనే ఆపన్నహస్తం అందించేందుకు సిద్ధమైపోతారు. ఇప్పటికే చిరంజీవి ఐ, అండ్ బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరికో సేవలందిస్తున్న మెగాస్టార్.. తాజాగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన మెగా అభిమాని వెంటనే కోలుకోవాలంటూ ఆయనకు లక్ష రూపాయల సాయం అందించారు. ఆ వివరాల్లోకి వెళితే ..
కడపకు చెందిన సీనియర్ మెగా అభిమాని పి సురేష్.. మెగా అభిమానులందరికీ సుపరిచితుడు. అఖిల భారత చిరంజీవి యువతకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన కడప జిల్లా మాజీ అధ్యక్షుడిగా ఎన్నో సేవలు అందించారు. మెగాస్టార్ చిరంజీవిని సురేష్ ప్రాణం కన్నా మిన్నగా అభిమానిస్తారు. అందుకే ఆయన చిరంజీవిరి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం సురేష్ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ కదిరిలో ఉంటున్నారు. చికిత్స నిమిత్తం ప్రతి రెండ్రోజులకోసారి కదిరి నుండి కడప, తిరుపతి వెళ్తూ వస్తున్నారు. ఆయన తీవ్ర ప్రస్తుతం సురేష్ అనారోగ్యంతో బాధపడటంతో పాటు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విషయం మెగాస్టార్‌కి తెలియడంతో సురేష్‌కి సాయం అందించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున పి సురేష్‌కి వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసారు.
గురువారం మధ్యాహ్నం సురేష్ అకౌంట్‌కు లక్షరూపాయలను ట్రాన్స్ఫర్ చేసారు. ఆపదలో ఉన్నవాళ్లను రక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందుంటారని మరోసారి దీని ద్వారా రుజువైంది. కరోనా సమయంలో కూడా అయన ఎందరో అభిమానులకు తనవంతు సాయం అందించారు. ఈ సందర్బంగా అఖిల భారత చిరంజీవి యువత మెగాస్టార్ చిరంజీవికి కృతఙ్ఞతలు తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout