కామెడీ ఎంటర్టైనర్ కు చిరు గ్రీన్ సిగ్నల్.. అల్లు అరవింద్ నిర్మాణంలో ?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల జోరుకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పెట్టెలా కనిపించడం లేదు. ఆచార్య ఇంకా రిలీజ్ కాకుండానే చిరు వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఆచార్య తర్వాత చిరంజీవి లూసిఫెర్ రీమేక్ లో నటించబోతున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే సన్నాహకాలు మొదలయ్యాయి.
ఇదీ చదవండి: అదరగొట్టే బీట్ తో 'దిగుదిగుదిగు నాగ' సాంగ్.. ఊరిస్తున్న రీతూ వర్మ
మోహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సంగీత దర్శకుడు తమన్ అప్పుడే సాంగ్స్ రికార్డింగ్ కూడా మొదలు పెట్టేశాడు. ఈ చిత్రం తర్వాత చిరు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. మెహర్ రమేష్ కి కూడా ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దర్శకులంతా లైన్ లో ఉండగానే చిరు మరో క్రేజీ దర్శకుడికి ఒకే చెప్పినట్లు లేటెస్ట్ న్యూస్.
వినోదాత్మక చిత్రాలు తెరకెక్కించే మారుతీ.. ఇటీవల చిరంజీవికి ఓ కామెడీ ఎంటర్టైనర్ కథ వినిపించాడట. కథ హిలేరియస్ గా మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కు బాగా సెట్ అయ్యే విధంగా ఉండడంతో చిరు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. మారుతి ఎప్పటి నుంచో చిరుతో సినిమా చేయాలని ప్రయత్నిస్తుండగా ఇప్పటికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ స్వయంగా నిర్మించబోతున్నట్లు వినికిడి. చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ తరహాలో హాస్యం ఉన్న చిత్రం చేసి చాలా కాలమే అవుతోంది. అందువల్ల మారుతి చెప్పిన కథకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం చిరు నటిస్తున్న ఆచార్య చిత్రం చివరిదశకు చేరుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com