శివాత్మికకు ధైర్యం చెప్పిన చిరంజీవి..
Send us your feedback to audioarticles@vaarta.com
శివాత్మిక రాజశేఖర్ ట్వీట్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కోవిడ్‌తో తన తండ్రి పోరాటం కష్టంగా మారిందని.. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండని శివాత్మిక కోరింది. ‘‘కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. అయినా ఆయన ధైర్యంగానే పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు’’ అని శివాత్మిక పేర్కొంది.
శివాత్మిక ట్వీట్‌ను చూసిన మెగాస్టార్ స్పందించారు. ఆమె తండ్రితో పాటు తన స్నేహితుడైన రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని శివాత్మికకు సూచించారు. ‘‘డియర్ శివాత్మిక.. మీ నాన్న, నా స్నేహితుడు అయిన రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మా అందరి ప్రార్థనలు, మద్దతు ఆయనకు, మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి’’ అని చిరు పేర్కొన్నారు.
కాగా.. కొద్ది రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకడంతో సిటి న్యూరో సెంటర్లో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. అయితే తన కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నారని.. తాను, జీవిత మాత్రం చికిత్స తీసుకుంటున్నామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా.. నేడు ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని శివాత్మిక తెలిపింది. అయితే సిటి న్యూరో సెంటర్ వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. నాన్ ఇన్వాసివ్ వెంటలేటర్ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
Dear @ShivathmikaR Wishing your loving dad and my colleague and friend #DrRajashekar a speedy recovery. All our best wishes and prayers are with him and your family. Stay Strong. https://t.co/7vorNZ8VMK
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 22, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com