శివాత్మికకు ధైర్యం చెప్పిన చిరంజీవి..

శివాత్మిక రాజశేఖర్ ట్వీట్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కోవిడ్‌తో తన తండ్రి పోరాటం కష్టంగా మారిందని.. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండని శివాత్మిక కోరింది. ‘‘కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. అయినా ఆయన ధైర్యంగానే పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు’’ అని శివాత్మిక పేర్కొంది.

శివాత్మిక ట్వీట్‌ను చూసిన మెగాస్టార్ స్పందించారు. ఆమె తండ్రితో పాటు తన స్నేహితుడైన రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని శివాత్మికకు సూచించారు. ‘‘డియర్ శివాత్మిక.. మీ నాన్న, నా స్నేహితుడు అయిన రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మా అందరి ప్రార్థనలు, మద్దతు ఆయనకు, మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి’’ అని చిరు పేర్కొన్నారు.

కాగా.. కొద్ది రోజుల క్రితం రాజశేఖర్‌ కుటుంబానికి కరోనా సోకడంతో సిటి న్యూరో సెంటర్‌లో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. అయితే తన కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నారని.. తాను, జీవిత మాత్రం చికిత్స తీసుకుంటున్నామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా.. నేడు ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని శివాత్మిక తెలిపింది. అయితే సిటి న్యూరో సెంటర్ వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. నాన్ ఇన్వాసివ్ వెంటలేటర్ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

More News

హీరో రాజశేఖర్ హెల్త్ బులిటెన్‌ విడుదల..

హీరో రాజశేఖర్ హెల్త్ బులిటెన్‌ను సిటీ న్యూరో సెంటర్ వైద్యులు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

వరుస ప్యాన్‌ ఇండియా చిత్రాలతో వరల్‌వైల్డ్‌గా ఇమేజ్‌ పెంచుకుంటోన్న రెబల్‌స్టార్‌ ప్రభాస్‌

రెబల్‌స్టార్‌ ‌ప్రభాస్‌..ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లోనే కాదు ఎంటైర్‌ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది.

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్, హత్య.. నిందితుల ఎన్‌కౌంటర్?

మహబూబాబాద్‌కు చెందిన ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి.. నాలుగు రోజుల పాటు బాలుడి తల్లిదండ్రులకు, పోలీసులకు చుక్కలు చూపించారు.

వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న 'రామరాజు ఫర్‌ భీమ్‌'

ఎంటైర్‌ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం).

ఒకసారి అలా.. వెంటనే మరోలా.. హీరో రాజశేఖర్ ఆరోగ్యం అసలెలా ఉంది?

హీరో రాజశేఖర్ కుటుంబం ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలసిందే. ఈ విషయాన్ని రాజశేఖర్ ఇటీవల ట్విట్టర్ వేదికగా స్వయంగా తెలిపారు.