చ‌ర‌ణ్‌పై చిరు ఫ‌న్నీ కామెంట్‌

కొడుకు చ‌ర‌ణ్‌ను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి ఓ ఫ‌న్నీ కామెంట్ చేశాడు. అది కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా... సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్ కాబ‌ట్టి ఎంత స్పీడుగా కామెంట్ స్ప్రెడ్ అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వివ‌రాల్లోకెళ్తే.. రామ్‌చ‌ర‌ణ్ నాన్న‌మ్మ అంజ‌నాదేవి ద‌గ్గ‌ర కొత్త రెసీపీ నేర్చుకున్నాడు.అదే వెన్న చిల‌క‌డం. ఒక‌ప్పుడు కవ్వంతో వెన్న తీసేవారు. కానీ ఇప్పుడు ఎల‌క్రిక‌ల్‌ మెషిన్స్ వ‌చ్చేశాయి. ఆ మెషిన్‌తోనే చ‌ర‌ణ్ వెన్న చిలికాడు. ఆ వీడియో త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు చెర్రీ. ఈ వీడియో సోష‌ల్ మీడియా తెగ వైర‌ల్ అయ్యింది.

అయితే చ‌ర‌ణ్ చేసిన ప‌నికి చిరంజీవి ఫ‌న్నీ కౌంట‌ర్ ఇచ్చాడు. ‘‘మై డియర్ బచ్చా ...మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. నువ్వెంత వెన్న చిలికినా నీ పొజిషన్ బెటర్ కాదు. అదే గ్యారంటీ మీ అమ్మ దగ్గర లేదనుకో’’ అంటూ లాఫింగ్ సింబ‌ల్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైర‌ల్ అవుతుంది. త్వ‌ర‌లోనే తండ్రీ కొడుకు మ‌రోసారి ఆచార్య సినిమాలో క‌లిసి న‌టించ‌బోతున్నారు. చిరంజీవి మాజీ న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టిస్తుంటే.. రామ్‌చ‌ర‌ణ్ ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌కుడి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తున్నారు.