గుండు హ‌నుమంతురావు, పొట్టి వీర‌య్య‌ల‌కు చిరంజీవి 4ల‌క్ష‌లు ఆర్ధిక‌ స‌హాయం

  • IndiaGlitz, [Monday,December 18 2017]

క‌మెడియ‌న్ గుండు హ‌నుమంతురావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధప‌డుతోన్న నేప‌థ్యంలో టెలివిజ‌న్ లో ప్ర‌సార‌మ‌య్యే 'అలీతో జాలీ'గా షో ద్వారా గుండు ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి 2ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను 'మా' మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు శివాజీ రాజా ద్వారా అంద‌జేశారు. 'మా' జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, ఎగ్యిక్యూటివ్ మెంబ‌ర్ సురేష్ స్వ‌యంగా అపోలో అసుప‌త్రికి వెళ్లి చెక్ అందించారు. అనంత‌రం గుండు హ‌నుమంతురావు త‌న అనారోగ్యాన్ని సైతం లెక్క చేయ‌కుండా చిరంజీవి గారితో కాసేపు ఫోన్ లో ఉత్సాహంగా మాట్లాడారు.

అలాగే మ‌రో క‌మెడియ‌న్ పొట్టి వీర‌య్య ఆర్ధిక ప‌రిస్థితుల‌ను చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ పేప‌ర్లో చ‌దివి చ‌లించిపోయారు. త‌మవంతు స‌హాయంగా వీర‌య్య కుటుంబానికి కూడా 2ల‌క్ష‌ల రూపాయ‌లు స‌హాయం చేసారు. వీర‌య్య ను 'మా' ఆఫీస్ కు పిలిపించి శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్ చేతుల మీదుగా 2ల‌క్ష‌ల చెక్ ను అందించారు.

ఈ సంద‌ర్భంగా 'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, -" రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవిగారు ఫోన్ చేసి శివాజీ అర్జెంట్ గా ఇంటికి రా అన్నారు. వెంట‌నే శ్రీరామ్, నేను వెళ్లాము. గుండు హ‌నుమంతురావు, పొట్టి వీర‌య్య క‌ష్టాల్లో ఉన్నట్లున్నారు..వెంట‌నే వాళ్లిద్ద‌రికీ చెరో రెండు ల‌క్ష‌లు ఇవ్వ‌మ‌ని చెక్ లు ఇచ్చారు. ఆయ‌న ఇచ్చిన అర‌గంట‌లోనే ఇద్ద‌రికీ చెక్ లు అందించాం. చిరంజీవి గారు చాలా సంతోషించారు. ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా...ఎవ‌రు క‌ష్టాల్లో ఉన్నా నాకొచ్చి చెప్పు. స‌హాయం చేద్దాం అన్నారు. ఈ విష‌యంలో నేను 'మా' అధ్య‌క్షుడిగానే కాకుండా న‌టుడిగా చాలా సంతోషించాను. హ్యాట్సాఫ్ చిరంజీవి గారు" అని అన్నారు.

More News

జో పాత్ర మెప్పిస్తుందంటున్న సురభి

ఉషాకిరణ్ మూవీస్ వారి బీరువా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ సుందరి సురభి.

సాయిధరమ్ కి ఈ సారైనా కలిసొస్తుందా?

సుప్రీమ్ తరువాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్.

అజ్ఞాత‌వాసికి స్ఫూర్తి ఆ పుస్త‌క‌మేనా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న 25వ చిత్రం అజ్ఞాత‌వాసి. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

ఈ వారంలోనే జై సింహా టీజ‌ర్‌

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం జై సింహా. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార, హ‌రి ప్రియ‌, న‌టాషా దోషి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

'ఎంసీఏ'తో ఈ ఏడాది మా బ్యాన‌ర్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ కొడుతున్నాం - దిల్‌రాజు

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో.. నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా 'ఎం.సి.ఎ'. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది.