విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చిరంజీవి.. టైటిల్ ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా డైరెక్టర్ బాబీ ఓ సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాను విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించడానికి బాబీ కథను సిద్ధం చేస్తున్నాడట. అంతే కాదండోయ్ ఈ సినిమాకు ‘వీరయ్య’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాల్లో నటించిన చిరంజీవి మరోసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటిస్తుండటం విశేషం.
ప్రస్తుతం చిరంజీవి తన 152వ చిత్రం ‘ఆచార్య’ను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం మే 13న విడుదలవుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే, మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్‌లో నటించబోతున్నాడు. దీని తర్వాత మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో వేదాళం రీమేక్‌లో చిరంజీవి నటిస్తాడని వార్తలు వినిపించినప్పటికీ వేదాళం కంటే ముందు బాబీ సినిమానే స్టార్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments