విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చిరంజీవి.. టైటిల్ ఖ‌రారు

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా డైరెక్ట‌ర్ బాబీ ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించ‌నుంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాను విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించ‌డానికి బాబీ క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌. అంతే కాదండోయ్ ఈ సినిమాకు ‘వీర‌య్య’ అనే టైటిల్‌ను అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాల్లో న‌టించిన చిరంజీవి మ‌రోసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటిస్తుండటం విశేషం.

ప్ర‌స్తుతం చిరంజీవి త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేసే ప‌నుల్లో బిజీగా ఉన్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం మే 13న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే, మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టించ‌బోతున్నాడు. దీని త‌ర్వాత మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్‌లో వేదాళం రీమేక్‌లో చిరంజీవి న‌టిస్తాడ‌ని వార్త‌లు వినిపించిన‌ప్ప‌టికీ వేదాళం కంటే ముందు బాబీ సినిమానే స్టార్ట్ అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

More News

ఎన్టీఆర్ 30లో ప్ర‌భాస్ విల‌న్‌...?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా ప్ర‌భాస్ సినిమాలో న‌టిస్తోన్న విల‌న్ క‌నిపించ‌బోతున్నాడా?

‘బీబీ 3’..లో బాల‌య్య‌ను ఢీ కొట్ట‌నున్న కోలీవుడ్ స్టార్‌..!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

‘వకీల్‌సాబ్’ ట్రైలర్: పవన్ ఎంట్రీయే దుమ్ములేచిపోయింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌‌ను కంప్లీట్ చేస్తోంది.

మైక్ మూవీస్, సొహైల్ కాంబోలో సినిమా.. హీరోయిన్‌గా...

‘బిగ్‌బాస్’ ఫేం సయ్యద్ సొహైల్ రియాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది.

‘ఎవర్‌ గివెన్’ నౌక విషయంలో గుడ్ న్యూస్..

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ నౌక ‘ఎంవీ ఎవర్‌ గివెన్ విషయంలో ఓ గుడ్ న్యూస్ తాజాగా వినవస్తోంది.