మెగాస్టార్ కి కళాబంధు డా.టి.సుబ్బిరామిరెడ్డి ఆత్మీయ అభినందన..!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమాని దశాబ్ధాలు పాటు ఏలిన మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఖైదీ నెం 150తో వెండితెర పై దర్శనమిచ్చారు. కమ్ బ్యాక్ లోనూ కొత్త రికార్డులు సృష్టించి కలకలం రేపారు మెగాస్టార్. ఎప్పటికీ మెగాస్టార్ మెగాస్టారే అని మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా సన్మానించారు. ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత, రాజ్యసభ్య సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డి.
ఆత్మీయ వేడుక పేరుతో టి.సుబ్బిరామిరెడ్డి గురువారం సాయంత్రం పార్క్ హయత్ లో నిర్వహించిన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు చిరంజీవి సతీమణి సురేఖ, రామ్ చరణ్, వినాయక్ ఇతర యూనిట్ సభ్యులు విచ్చేసారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు కూడా విచ్చేసి మెగాస్టార్ ని అభినందించారు.
నాగార్జున, అమల, అఖిల్, అల్లు అరవింద్, నాగబాబు, శ్రీకాంత్, ఆలీ, బ్రహ్మానందం, పరుచూరి బ్రదర్స్, జయప్రద, ఛార్మి, కోదండరామిరెడ్డి, బి.గోపాల్, సత్యానంద్, పూరి జగన్నాథ్, అశ్వనీదత్, జెమిని కిరణ్, దిల్ రాజు, పీవీపీ, డాక్టర్ గోపీచంద్...తదితర సెలబ్రిటీలు విచ్చేసారు.
తొమ్మిదేళ్ల తర్వాత వచ్చినా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150వ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడం వారం రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు అందుకోవడం ఆయన స్టామినాకు నిదర్శనం. ఇప్పటికీ అదే ఉత్సాహం ఆయనలో కనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. తోటి కళాకారుల పట్ల అదే గౌరవం చూపడం ఆయన విలక్షణ వ్యక్తిత్వానికి ప్రతీక. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనకే చెల్లింది. మెగాస్టార్ తో నేను స్టేట్ రౌడీ చిత్రాన్ని నిర్మించాను. అప్పట్లో అది ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఆయనతో నా అనుబంధం ప్రత్యేకమైనది అని టి.సుబ్బిరామిరెడ్డి మెగాస్టార్ తన అనుబంధాన్ని పంచుకున్నారు.
చిరంజీవితో ఇప్పటికే సినిమా తీసాను. అలాగే ఇప్పటికి 14 సినిమాలు నిర్మించాను. అందులో మల్టీస్టారర్ మూవీస్ కూడా ఉన్నాయి. ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్లో త్వరలో ఓ భారీ చిత్రాన్ని తీస్తానని ప్రకటించాను. ఈ సినిమాలో అశ్వనీదత్ భాగస్వామి అవుతాను అని అన్నారు. ఆయనతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తాను. త్వరలోనే వీరందరిని వ్యక్తిగతంగా కలవడం జరుగుతుంది. తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు అంతర్జాతీయ స్ధాయిలో విస్తరించింది. ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రాతో కలిసి ఉమ్మడిగా ఒక తెలుగు సినిమా తీయాలని చర్చించాం. ఆయనతో కలిసి తెలుగులోను భారీ ఎత్తున సినిమాలు తీస్తాను అని సంచలన ప్రకటన చేసారు సుబ్బిరామరెడ్డి.
నిర్మాతగా, వ్యాపారవేత్తగా, కళాబంధువుగా ఆయన ఏం చేసినా సంచలనమే. భారీతనానికి మారు పేరు అయిన సుబ్బరామిరెడ్డి మాత్రమే ఇలాంటి భారీ సినిమాలు తీయగలడు అనడంలో సందేహం అక్కర్లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout