చిరు జోలికొస్తే చూస్తూ ఊరుకోం.. తోలు తీస్తాం!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటిని ముట్టడించాలని అమరావతి జేఏసీ నాయకులు అనుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తాము ఈ ప్రకటన చేయలేదని జేఏసీ చెప్పినప్పటికీ క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ ముట్టడికి సంబంధించి పెద్ద ఎత్తున ఫామ్లెట్స్ వైరల్ అవుతున్నాయ్. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని.. తాము అభిమానించే మెగాస్టార్ కోసం అభిమానులు, యువత పెద్ద ఎత్తున కదిలింది.. శనివారం నాడు చిరు ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు సైతం రంగంలోకి దిగి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చిరు ఇంటికెళ్లే దారిలో బారీకేడ్లు.. ఇంటి చుట్టూ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా భారీగానే తరలి వచ్చి ‘అన్నయ్య’ ఇంటి ఎదుట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు.
హానీ తలపెట్టాలని చూశారో!
ఈ క్రమంలో చిరు ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు ఒక్క పిలుపునివ్వడంతో చిరంజీవి యువత, రామ్ చరణ్ యువశక్తి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో చిరు ఇంటి అభిమానుల కోలాహలం నెలకొంది. ‘చిరంజీవి ఇంటిని ముట్టడిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు. చిరు జోలికొస్తే చూస్తూ ఊరుకోం.. తోలు తీస్తాం’ అని ఆందోళనాకారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మెగాభిమానులు ఇటు సోషల్ మీడియాలో.. అటు హైదరాబాద్లో పలుచోట్ల బ్యానర్లు కట్టారు. రాజకీయాలకు ఎప్పట్నుంచో దూరంగా ఉండి సినిమాలు చేసుకుంటున్న అన్నగారిని.. రాజకీయాల ముసుగులో రాముడి లాంటి ‘అన్నయ్య’కు హానీ తలపెట్టాలని ఆలోచించినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తూ.. నినాదాలతో హోరెత్తించారు.
మమ్మల్ని దాటి వెళ్లండి!
ఇదిలా ఉంటే.. చిరు ఇంటి ముందు ఉన్న ఓ బ్యానర్లో..‘నాలుగు దశబ్ధాలుగా మా జీవనంలో, మా జీవితాల్లో భాగమై.. కణ కణాన అణుఅణువున.. మాలో మిళితమైన మా ఆశ, ఆయువు, శ్వాస.. అన్నీ తానై మమ్ముల్ని నడిపిస్తున్న శిఖరము రా.. చిరంజీవి.. అనే నాలుగు అక్షరాలు.. ఆయన వద్దకు వెళ్లాలంటే ముందు మమ్మల్ని దాటి వెళ్లాలి’ అని మెగాభిమానుల బ్యానర్లో ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com