Kodali Nani:చిరంజీవిపై కొడాలి నాని వ్యాఖ్యలు : భగ్గుమన్న మెగాస్టార్ ఫ్యాన్స్.. గుడివాడలో భారీ నిరసన, ఉద్రిక్తత
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం వాటికి ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు అంతే స్థాయిలో ఘాటుగా బదులివ్వడం తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ అభిమానులు భగ్గుమన్నారు. దీనిలో భాగంగా బుధవారం గుడివాడలో చిరు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. చిరంజీవికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కొడాలి నానికి బుద్ధి చెబుతామన్న చిరు అభిమానులు :
అయితే ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో చిరు అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే చిరంజీవి అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం స్థానిక ఏజీకే స్కూల్ సెంటర్‌లో బైఠాయించిన చిరు అభిమానులు.. వంగవీటి మోహనరంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. చిరు, రంగా అభిమానుల మద్ధతుతో గెలిచిన నానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు.
పకోడిగాళ్లంతా చెప్పేవాళ్లే :
నిన్న కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ..చిత్ర పరిశ్రమలో చాలా మంది పకోడిగాళ్లు వున్నారని.. ప్రభుత్వం ఎలా వుండాలో ఆ పకోడిగాళ్లు కూడా సలహాలిస్తున్నారంటూ నాని సెటైర్లు వేశారు. అలాంటి వాళ్లు తమ వాళ్లకు కూడా రాజకీయాలు మనకెందుకురా బాబూ.. డ్యాన్సులు, ఫైట్లు చూసుకుందామని సలహాలిస్తే బాగుంటుందని పరోక్షంగా పవన్‌కు కూడా చురకలంటించారు నాని.
చిరంజీవి ఏమన్నారంటే :
బాబీ దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలు, అధికారులు పెద్ద పెద్ద విషయాలపై దృష్టి పెట్టాలని చిరంజీవి సూచించారు. మంచి ఫలితాలు రప్పించేలా పనిచేయాలని, ప్రత్యేక హోదా, లేదంటే సాగునీటి ప్రాజెక్ట్‌ల గురించి కానీ.. లేదా రోడ్ల నిర్మాణాల గురించి కానీ, పేదవాళ్ల ఆకలి తీర్చే పథకాలపై దృష్టి పెట్టాలని చిరంజీవి సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడితే అంతా సంతోషిస్తారని చిరంజీవి పేర్కొన్నారు. కానీ అవన్నీ వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా సినిమా ఇండస్ట్రీపై పడితే ఎలా.. ఇలాంటి పనులు మానుకోవాలని మెగాస్టార్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout