Waltair Veerayya : బాస్ సినిమా ఆలస్యం.. కట్టలు తెంచుకున్న అభిమానం, థియేటర్ అద్దాలు ధ్వంసం
Send us your feedback to audioarticles@vaarta.com
సినీతారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులను మనదేశంలో ప్రజలు దైవంగా భావిస్తారు. వారు జనంపై, సమాజంపై వేసే ముద్ర అలాంటిది. అందుకే అంతటి ఫాలోయింగ్. తమ అభిమాన హీరో, హీరోయిన్, క్రీడాకారుడు, నాయకులను జనం బాగా అనుకరిస్తారు. షూ దగ్గరి నుంచి హెయిర్ స్టైల్ వరకు ఇలా ఆ పాదమస్తకం మక్కీకి మక్కీ దింపే వారు మన చుట్టూ కొకొల్లలు.ఇక సినిమాల విడుదలల సమయంలో వుండే హంగామా అంతా ఇంతా కాదు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు , పాలాభిషేకాలు, రక్తదానాలు, అన్నదానాలకు తోడు థియేటర్‌ను కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబు చేస్తారు అభిమానులు. అయితే ఫ్యాన్స్‌ను ఏమాత్రం హర్ట్ చేసినా ఆ రోజు తెరలు చిరిగిపోవడం, కుర్చీలు విరిగిపోవడం మామూలుగా వుండదు. అందుకే వారిని ఏమాత్రం నొప్పించకుండా చూసుకుంటారు.
తెల్లవారుజామునే థియేటర్ వద్దకు అభిమానులు :
ఇదిలావుండగా.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య సినిమా ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంతో తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద బారులు తీరారు. అయితే గుంటూరు జిల్లా పొన్నూరులో వాల్తేర్ వీరయ్య విడుదల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
సాంకేతిక లోపంపై ముందస్తు సమాచారం ఇవ్వని యాజమాన్యం :
స్థానిక శ్రీలక్ష్మీ థియేటర్‌లో సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా చూసేందుకు తెల్లవారుజాము నుంచే ఫ్యాన్స్ థియేటర్ వద్దకు చేరుకున్నారు. అయితే ఎంతకీ సినిమాను వేయకపోయినప్పటికీ అభిమానులు ఓపికగా ఎదురుచూశారు. చివరికి సాంకేతిక లోపం కారణంగా సినిమాను ప్రదర్శించలేకపోతున్నామని యాజమాన్యం ప్రకటించడంతో వారి అభిమానం కట్టలు తెంచుకుంది. ముందే సమాచారం ఇవ్వకుండా ఇలా ఎందుకు చేశారంటూ ఫైర్ అయ్యారు. చివరికి కోపంతో థియేటర్ అద్దాలు పగులగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అభిమానులకు నచ్చజెప్పి అభిమానులను అక్కడి నుంచి పంపించి వేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com