చిరు-కొరటాల చిత్రంలో డబుల్‌ రోల్.. ఒక పాత్ర రివీల్!

  • IndiaGlitz, [Friday,August 02 2019]

మెగాస్టార్ చిరంజీవీ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన రెండో చిత్రం ‘సైరా’ నరసింహారెడ్డి. త్వరలోనే ‘సైరా’ను మెగాభిమానులు, సినీ ప్రియుల ముందుకు చిత్రబృందం తీసుకురాబోతోంది. ఇక మెగాస్టార్ తదుపరి చిత్రం విషయానికొస్తే.. చిరు-కొరటాల శివ కాంబోలో వస్తోంది. ఆగస్ట్-22న చిరు పుట్టిన రోజు కావడంతో అదే రోజు సినిమా షూటింగ్ కూడా షురూ చేయాలని కొరటాల ఆలోచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో లీకులు ఎక్కడ్నుంచి వస్తున్నాయేమో గానీ.. ఇదిగో చిరు పాత్ర ఇలా ఉండబోతోంది..? సినిమాలో చిరు డబుల్ రోలం..? ఇలా పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇక తాజాగా అయితే.. ఏకంగా చిరు డబుల్ రోల్‌లో నటిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొస్తున్నాయ్. అంతేకాదు.. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఓ పాత్రలో నక్సలైట్‌గా నటించనున్నారట. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పెద్దగా నక్సలైట్లు లేరు.. కనుచూపు మేరలో కనపడట్లేదు.. మున్ముంధు కూడా కనిపించే పరిస్థితులు చాలా తక్కువేనని చెప్పుకోవచ్చు. అయితే 80వ దశకంలో నక్సలైట్ల ప్రభావం ఎలా ఉండేది..? అనేది చిరు నటిస్తున్న ఈ పాత్రలో తెలుస్తుందట.

తెలంగాణలో.. 80వ దశకంలో మావోల ప్రభావం ఎలా ఉండోదనేది అనేదాన్ని నేపథ్యంగా ఎంచుకుని సందేశాత్మకంగా.. తనదైన శైలిలో కొరటాల తెరకెక్కించబోతున్నాడట. డిఫరెంట్ స్టోరీలకు కేరాఫ్ అయిన కొరటాల.. చిరును ఎలాంటి పాత్రలో చూపిస్తారో ఏంటో తెలియాలంటే కాసింత ఈ పుకార్లను పక్కనెట్టి.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.