సరదాగా అమ్మ కోసం.. తిడుతుందో.. బ్రహ్మాండం అంటుందో.. : చిరు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి తన తల్లి కోసం చేపల వేపుడు చేశారు. నిన్ననే ఆ వీడియోను పోస్ట్ చేస్తానన్న ఆయన విజయవాడలో కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పది మంది చనిపోయిన వార్త విని కలత చెందానని అందుకే పోస్టు చేయలేదన్నారు. నేడు ఆయన ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను 30 నిమిషాల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు వ్యూస్ ఇప్పటికే లక్ష దాటేశాయి. మరింకెన్ని వ్యూస్ వస్తాయో వేచి చూడాలి.
‘‘నిన్న సండే. ఖాళీగా ఉన్నాను. ఏమీ తోయడం లేదు.. ఏదో ఒకటి చేయాలనిపించింది. ఏం చేద్దామా? అని అనుకుంటుండగా.. వంటెందుకు చేయకూడదనిపించింది. వంటనేసరికి నాకు ఒక్కసారి చిన్నప్పటి రుచులు గుర్తొచ్చాయి. అమ్మ చిన్న చిన్న చేపలను.. చింతకాయ తొక్కుతో దగ్గరగా దాన్ని ఫ్రై చేసి చేసి పెట్టేది. చాలా రుచిగా ఉండేది. అమ్మ మాకింత చేసి పెట్టేది కదా.. సరదాగా అమ్మకి.. ఈ కూర నేను చేసి పెడితే ఎలా ఉంటుంది అనిపించింది. మరి తిడుతుందో.. బ్రహ్మాండంగా ఉంది అంటుందో చూద్దాం’’ అంటూ చిరు చేపల వేపుడు చేసి తన తల్లికి వడ్డించారు. ఆమె రిజల్ట్ కోసం సినిమాటిక్ స్టైల్లో వెయిట్ చేశారు. ఆమె ‘చాలా బాగుంది నాన్నా’ అనడంతో చిన్నపిల్లాడిలా సంబరపడిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments