ఎన్టీఆర్ కి భారతరత్న.. మెగాస్టార్ ఎలా డిమాండ్ చేశారో చూడండి
- IndiaGlitz, [Friday,May 28 2021]
నేడు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 98వ జయంతి. ఈ సందర్భంగా ప్రముఖులంతా ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అటు సినిమాల్లో, రాజకీయాల్లో విజయకేతనం ఎగురవేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. రాజకీయాల్లో అయితే తెలుగువారి సత్తాని ఆయన ఢిల్లీ వరకు వినిపించేలా చేశారు.
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: రాజమౌళి తండ్రి ఫోన్ లో పూరి ఫోటో.. షాకింగ్ రీజన్
'ప్రముఖ గాయకులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారకరామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణం. ఆయన 100వ జయంతి దగ్గరపడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదినం సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇక తాతకి తగ్గ మనవడు అనిపించుకుంటున్న జూ.ఎన్టీఆర్ కూడా తన తాతగారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకున్నారు. తెలుగు సినీప్రముఖులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన ఖ్యాతిని కొనియాడుతున్నారు.
#RememberingTheLegend#BharatRatnaForNTR pic.twitter.com/efN2BIl8w7
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2021