మరో రెండు ప్లాన్ చేస్తున్న మెగా తనయ!!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి కుంటుంబంలో ఇప్పటికే రామ్‌చరణ్ నిర్మాతగా మారి వరుస సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మరో నిర్మాతగా కూడా చేరారు. ఆమె ఎవరో కాదు.. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత. గత కొంతకాలంగా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి’ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు. ఇప్పుడు ఈమె నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
‘ఓయ్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆనంద రంగ ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కబోతున్న ఈ వెబ్ సిరీస్‌లో ఎనిమిది భాగాలుంటాయట. ఒక్కొక్క భాగం నలబై నిమిషాల నిడివితో ఉంటుందట. ఇవి కాకుండా మరో రెండు వెబ్ సిరీస్‌లను కూడా సుస్మిత తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ రెండు వెబ్ సిరీస్‌లు రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాయట. ప్రస్తుతం వీటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. మరి వీటి డైరెక్టర్స్, నటీనటులు ఎవరు? అనే విషయాలు తెలియాలంటే కొంతకాలం వెయిటింగ్ తప్పేలా లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments