సమంత స్కూల్లో చిరు మనవరాలు
Send us your feedback to audioarticles@vaarta.com
లేడీ ఓరియెంటెడ్, పెర్ఫార్మెన్స్ పాత్రల వైపే మొగ్గు చూపుతున్న స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని. ఈమె ఇప్పుడు సినిమాలతో పాటు డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి కూడా తెలిసిందే. ఇక సినిమాలకు, డిజిటల్లకు సంబంధం లేకుండా ఓ ప్రీ ప్రైమరీ స్కూల్‌ను కూడా స్టార్ట్ చేసింది. ఇటీవలే స్టార్ట్ అయిన ఆ స్కూల్ పేరు ఏకం. విద్యావేత్త ముక్తా ఖురానాతో పాటు శిల్పా రెడ్డితో కలిసి సమంత ఈ స్కూల్‌ను స్టార్ట్ చేసింది. ఆసక్తికరమైన విషయమేమంటే.. సమంత స్కూల్లో చిరంజీవి మనవరాలు జాయిన్ కావడమే. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తనయ ఏకం స్కూల్లోనే జాయిన్ కావడం గమనార్హం.
2019 నుండి సమంత ప్రీ ప్రైమరీ స్కూల్‌ను పెట్టాలనుకుంది. అది ఇప్పటికి వేరిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన స్కూల్‌కు సంబంధించిన ఓ చిన్న వీడియో కూడా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సామ్. ప్రస్తుతం ఈమె ఓ తమిళ సినిమాతో పాటు ఫ్యామిలీమేన్ సీజన్లో నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తుంది. అలాగే అల్లు అరవింద్‌కు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలోనూ ఓ రియాలిటీ షోను చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తుందని కూడా అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com