సరికొత్త రికార్డులు దిశగా చిరు....
Send us your feedback to audioarticles@vaarta.com
గ్యాప్ వస్తే వచ్చింది కానీ మెగాస్టార్ మాత్రం హీరోగా మరోసారి తనెంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా కొనసాగిన చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఇప్పుడు తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. చిరు రీ ఎంట్రీ చిరుకు ఎలాంటి రిజల్ట్స్‌ను తెచ్చి పెడుతుందోనని ఎదురుచూసిన అందరికీ ఓ రకంగా షాకిచ్చాడు చిరు.
బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. తొలి వారంలోనే వంద కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసేశాడు చిరు. ఇప్పుడు సినిమా కలెక్షన్స్ షేర్ పరంగా చూస్తే వరల్డ్ వైడ్‌గా 95 కోట్లను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. బాహుబలి తర్వాత వందకోట్ల షేర్ మార్కెట్‌ను చేరుకునే హీరోగా చిరంజీవి నిలవడం ఖాయమని అందరూ అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com