మురళీ మోహన్‌కు ఆపరేషన్.. చిరు దంపతుల పరామర్శ

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటీవలే ఆయన వెన్నెముక‌కు ఆప‌రేష‌న్ జ‌రిగింది. దీంతో మురళీ మోహన్‌ తన ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన వారణాసికి వెళ్లిన ఆయన అక్కడే అనారోగ్యానికి గురయ్యారు. మురళీ మోహన్ అమ్మగారి అస్థికలను గంగానదిలో కలిపేందుకు వెళ్లిన ఆయన వెన్నెముక నొప్పితో బాధపడుతూ హైదరాబాద్ వచ్చి చికిత్స చేయించుకున్నారు. కాగా.. తన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతుండటంతో ఓ వీడియో విడుదల చేశారు.

నేనే వస్తా.. లేకుంటే ఒక్కొక్కరుగా రండి!

మే 14న వార‌ణాసిలో ముర‌ళీమోహ‌న్ అమ్మ‌గారి అస్థిక‌ల‌ను గంగాన‌దిలో క‌ల‌ప‌డానికి వెళ్లాను. అక్క‌డ నా రెండు కాళ్ల‌కు స‌మస్య‌ వ‌చ్చి న‌డ‌వ‌లేకపోయాను. వార‌ణాసి నుంచి వెంట‌నే హైద‌రాబాద్‌కు వచ్చి నగరంలోని కేర్ ఆస్పత్రిలో చేరాను. చెక‌ప్ చేసిన అనంతరం డాక్ట‌ర్స్ వెన్నెముక‌లోని ఎల్4, ఎల్‌5, ఎల్‌6 వ‌ద్ద న‌రాలు ఒత్తిడికి గుర‌వుతున్నాయ‌ని.. వీలైనంత త్వరగా ఆప‌రేష‌న్ చేయాల‌ని వైద్యులు సూచించారు. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మే 24న కేర్ ఆసుప‌త్రిలో ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా ముగిసింది. జూన్ 7న ఆపరేషన్‌ చేసినప్పటి కుట్లు తీయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం నేను మా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను. ఈ నెల 10 త‌ర్వాత ఆరోగ్యం కుదుట‌ప‌డితే నేనే రాజ‌మండ్రిలోని స‌న్నిహితులు, పార్టీ వ‌ర్గాలను, అభిమానుల‌ను క‌లుసుకుంటాన‌ు. ఒకవేళ అలా కుదరని పక్షంలో.. ఇంకా స‌మ‌యం ప‌ట్టేట్లు ఉంటే ఒక్కొక్క‌రుగా వ‌చ్చి న‌న్ను క‌ల‌వ‌వ‌చ్చు అని ముర‌ళీమోహ‌న్ వీడియో చెప్పుకొచ్చారు.

చిరు దంపతుల పరామర్శ..

కాగా.. మురళీ మోహన్‌కు ఆపరేషన్ జరిగిందని తెలుసుకున్న మెగాస్టార్‌ చిరు దంపతులు పరామర్శించారు. శనివారం మధ్యాహ్నం చిరంజీవి, సురేఖ.. ముర‌ళీమోహ‌న్ ఇంటికెళ్లి సుమారు అరగంట పాటు చికిత్స గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని పుష్పగుచ్ఛం అందజేసి పరామర్శించారు. ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీకి చెందిన ఎవరికైనా అనారోగ్యం పాలైనట్లుగానీ.. ఇబ్బందుల్లో ఉన్నట్లు గాని చిరు దృష్టికి వస్తే తప్పకుండా తనవంతుగా పరామర్శించడం.. సాయం చేయడంలో ఆయన ముందుంటారన్న విషయం తెలిసిందే.

More News

మళ్లీ ‘ప్రేమ’ నేర్చుకోవడం సాధ్యమేనా..!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సినీ ప్రియులు, జనసేన కార్యకర్తలు, అభిమానులకు కొత్త పరిచయం చేయనక్కర్లేదు.

చివరి రక్తపుబొట్టు వరకు ప్రజాసేవే.. ఇప్తార్ విందులో బాలయ్య

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి నిలిచిన ఎమ్మెల్యే బాలయ్య ముస్లిం సోదరులకు ఇపఫ్తార్ విందు ఇచ్చారు.

ఘనంగా జరిగిన సూపర్‌స్టార్‌ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు

పద్మ భూషణ్‌ నటశేఖర సూపర్‌ స్టార్‌ కృష్ణ గారి 77వ జన్మదిన వేడుకలు మే31న హైదరాబాద్‌ పద్మాలయ స్టూడియోస్‌లో

మోదీ ప్రమాణం చేసిన మరుసటి రోజే షాకింగ్ న్యూస్!

ఇండియా అభివృద్ధి చెందుతోంది.. తగు సంక్షేమ పథకాలు పేదలకు కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నాం..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. వేతనాలు 25% పెంపు

కేంద్రంలో వరుసగా రెండోసారి కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం శుక్రవారం నాడు తొలిసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది.