అమితాబ్‌ని ఆ అవార్డు వరించడం చాలా సంతోషంగా ఉంది: చిరంజీవి

  • IndiaGlitz, [Wednesday,September 25 2019]

లివింగ్ లెజెండ్ శ్రీ అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. 1969లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. గడిచిన యాభై వసంతాల కాలంలో చరిత్రలో నిలిచిపోయే చిత్రాలెన్నింటిలోనూ నటించి మెప్పించారు.

యుక్తవయసులో యాంగ్రీ యంగ్ మెన్ అనిపించుకున్న అమితాబ్ జీ... ఇప్పుడు వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుని, తాను పోషించే ప్రతి పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. మా అబ్బాయి రామ్ చరణ్‌ నిర్మించిన, 'సైరా... నరసింహారెడ్డి' చిత్రంలోనూ నా గురువు గోసాయి వెంకన్న పాత్రను ఆయన పోషించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ చిత్రం విడుదల కాబోతున్న శుభతరుణంలో అమితాబ్ జీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.

ఇప్పటికే పద్మశ్రీ,, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్ పురస్కారాలు పొందిన అమితాబ్ బచ్చన్ జీ చిత్రసీమకు చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపిక కావడం మా యూనిట్ మొత్తంలో ఆనందోత్సాహాలను నింపింది.

More News

వేణుమాధ‌వ్ మృతికి చిరంజీవి సంతాపం

ప్ర‌ముఖ హాస్య న‌టుడు వేణు మాధ‌వ్ బుధ‌వారం హైద‌రాబాద్ లో ఓ ప్ర‌యివేట్ ఆసుప‌త్రిలో అనారోగ్యం కార‌ణంగా  తుదిశ్వాస  విడిచిన సంగ‌తి తెలిసిందే.

చివరి కోరిక తీరకుండానే వేణుమాధవ్ కన్నుమూత!

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ ఇకలేరు

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:21 గంటలకు తుదిశ్వాస విడిచారు.

'నిశ్శ‌బ్దం' గా అనుష్క క‌ష్టం

గ‌త ఏడాది `భాగ‌మ‌తి`తో హిట్‌ను సొంతం చేసుకున్న టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి.. సినిమాల‌కు గ్యాప్ తీసుకుంది.

ఆస‌క్తిక‌ర‌మైన బ్యాక్‌డ్రాప్‌లో వెంకీ

విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం సినిమాల ఎంపిక‌లో వైవిధ్య‌త‌తో పాటు..వేగాన్ని చూపిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి `ఎఫ్ 2`తో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు.