తేజ్ ను కన్ ఫ్యూజ్ చేసిన చిరు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ భారీ చిత్రాన్ని వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు వీణ స్టెప్ వేయనున్నారని...చిరంజీవితో పాటు సునీల్ & సాయిధరమ్ తేజ్ కూడా డ్యాన్స్ చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఇదే విషయం గురించి సాయిధరమ్ తేజ్ ని అడిగితే....చిరంజీవి గారి 150వ సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే చేయడానికి రెడీగా ఉన్నాను. మావయ్యా....నీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయాలనివుంది అని అడిగాను. మావయ్య ఏమీ మాట్లాడకుండా చిరునవ్వుతో సమాధానం చెప్పారు. అయితే...చిరునవ్వును ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు తేజు. మరి...తేజు కన్ ఫ్యూజన్ ని చిరు ఎప్పుడు క్లియర్ చేస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com