గుండు హనుమంతరావు మృతి తీరని లోటు : చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్యనటుడిదీ ఒక్కో శైలి. అలానే గుండు హనుమంతరావుగారు సైతం తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారు. ఆ మధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను. నా వంతు సాయం అందించాను.
పరిపూర్ణ ఆరోగ్యంతో ఆయన తిరిగి సినిమాల్లో నటిస్తారని భావించాను. కానీ ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. గుండు హనుమంతరావు గారి మృతితో తెలుగు సినిమా రంగం మంచి నటుడినే కాదు, చక్కని మనిషినీ కోల్పోయింది.
ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను.- చిరంజీవి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com