మెగాస్టార్ 38 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ..!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినీ ప్రపంచంలో పునాదిరాళ్లు సినిమాతో ప్రవేశించి... చిరు పాత్రలు పోషించే స్ధాయి నుంచి చిరంజీవిగా ప్రేక్షక హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. పాత్రపరిధి గురించి ఆలోచించకుండా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు..ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఓ స్ధానాన్ని ఏర్పరుచుకున్నారు...! పున్నమినాగు, శుభలేఖ, అభిలాష, ఖైదీ, ఛాలెంజ్, స్వయంకృషి, విజేత...ఇలా కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించారు.
తన నటనతో, డ్యాన్స్ తో కోట్లాది హృదయాలను కొల్లగొట్టి పట్టుదల ఉంటే కానిది లేదు అని నిరూపించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు మెగాస్టార్ 150వ చిత్రం ఖైదీ నెం 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఖైదీ నెం 150 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే....నేటికి మెగాస్టార్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి సరిగ్గా 38 సంవత్సరాలు. ఈ సందర్భంగా మెగాస్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నిన్న, నేడు, రేపు, ఎప్పుడూ అన్నయ్యే మెగాస్టార్ అంటూ ట్వీట్ చేస్తుండడం ట్రెండ్ అయ్యింది. మెగాస్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చి 8 సంవత్సరాలు అయినా ఏమాత్రం క్రేజ్ - ఇమేజ్ తగ్గలేదు. దీంతో మెగాస్టార్ 150వ సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అనిపిస్తుంది. మరి...ఏరేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments