'గీత గోవిందం' ను తన 'ఖైదీ' తో పోల్చిన చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్‌దేవరకొండ, రష్మిక జంటగా పరుశురాం దర్శకత్వంలో రూపొందిన `గీత గోవిందం` సినిమాతో విజయ్ దేవరకొండ కొత్త స్టార్‌గా అవతరించాడు. సినిమా 50 కోట్ల క్లబ్‌లో చేరనుంది. మూడో సినిమాకే ఈ క్రెడిట్‌ను సాధించిన హీరో విజయ్ దేవరకొండ.
నిన్న జరిగిన సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి యూనిట్‌ను అభినందిస్తూ.. `1978 నుండి సినిమాలు చేస్తూ వస్తే.. ఖైదీతో నాకు బ్రేక్ వచ్చింది.. స్టార్ స్టేటస్ వచ్చింది. ఇప్పుడు గీత గోవిందం విజయ్ దేవరకొండకు స్టార్ స్టేటస్‌ను ఇచ్చింది` అంటూ విజయ్ దేవరకొండను అభినందించారు మెగాస్టార్. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో విజయ్ ఒకడు. అచి తూచి అడుగులు వేయమని విజయ్ దేవరకొండకు సలహా ఇచ్చారు చిరంజీవి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments