క్లైమాక్స్ ఫైట్ లో చిరు...

  • IndiaGlitz, [Monday,November 07 2016]

మెగాస్టార్ చిరంజీవి క‌మ్‌బ్యాక్ మూవీ ఖైదీ నంబ‌ర్ 150 శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుప‌కుంటుంది. మ‌రోవైపు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా స‌మాంత‌రంగా జ‌ర‌గుతున్నాయి. త‌మిళ చిత్రం క‌త్తి రీమేక్‌గా రూపొందుతోన్న ఖైదీ నంబ‌ర్ 150లో తెలుగు ఆడియెన్స్ అభిరుచికి త‌గిన విధంగా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌. చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో రైతు స‌మ‌స్య‌ల‌పై తెరకెక్కుతుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ల‌క్ష్మీరాయ్ స్పెష‌ల్ సాంగ్ చేసింది. సినిమా ఇప్పుడు తుది ద‌శ చిత్రీక‌ర‌ణ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం క్లైమాక్స్ ఫైట్‌ను షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్‌ను క‌న్న‌ల్ క‌ణ్ణ‌న్ నేతృత్వంలో కంపోజ్ చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు.