స‌స్పెన్స్‌కు తెర దించిన చిరంజీవి

కరోనా ప్ర‌భావంతో సినీ సెల‌బ్రిటీలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఓ పోస్ట్ చేశారు. నేను సాంగ్స్ వింటున్న‌ప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. మ‌ధ్య‌లో పాట‌ను పాజ్ చేయ‌ను. కానీ ఓ పాట‌ను ఎక్కువ‌గా పాజ్ చేస్తున్నాను. దీనికి కార‌ణాన్ని మంగళ‌వారం చెబుతాన‌ని ట్వీట్ చేశారు. అన్న‌ట్లుగానే ఆయ‌న మంగ‌ళ‌వారం సస్పెన్స్‌కు తెర దించుతూ ట్వీట్ చేశారు. త‌న మ‌న‌వ‌రాలు న‌విష్క‌తో చిరంజీవి ఓ పాట‌ను వింటూ డ్యాన్స్ చేస్తూ పాట‌ను పాజ్ చేస్తూ పాప‌ను ఆట‌ప‌ట్టించే వీడియోను పోస్ట్ చేశారు.

ఇంత‌కు చిరంజీవి అంత‌లా ఎంజాయ్ చేసిన పాట ఏదో తెలుసా? ఆయ‌న 150వ సినిమా ఖైదీ నంబ‌ర్ 150లోనిది. దేవిశ్రీ కంపోజ్ చేసిన ‘మి మి మిమ్మిమీ...’ సాంగ్‌ను న‌విష్క కోరిక మేర‌కు ప్లే చేస్తూ ఎంజాయ్ చేశారు. పాప డాన్స్ చేస్తుంటే చిరు కూడా బాడీని షేక్ చేస్తూ న‌వ్వుకున్నారు. ఈ వీడియో పాటు ‘‘మ్యూజిక్‌కి ఉన్నశక్తి చాలా గొప్పది. ఏడాది నిండిన పాప పాటను వింటూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుందో చూసి ఆనందపడ్డాను. తను పాటను నిజంగానే విని ఎంజాయ్ చేస్తుందో లేదోనని పాటను కాసేపు ఆపి చూశాను. తను నిజంగానే పాటను ఎంజాయ్ చేస్తుంది. పాట నాదే కాబట్టి, అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే’’ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారాయన.

ఈ వీడియో చూసిన మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క్యూట్‌నెస్ ఓవ‌ర్‌లోడెడ్ అని మెసేజ్ చేయ‌గా.. నేచుర‌ల్ స్టార్ నాని ‘‘నాకు వీడియోలో ఇద్దరు చిన్న‌పిల్ల‌లు క‌న‌ప‌డుతున్నారు. మీరు ఎవ‌రి గురించి మాట్లాడుతున్నారు. వెల్‌క‌మ్ టు ట్విట్ట‌ర్ మెగాస్టార్ చిర‌జంజీవిగారు’’ అని మెసేజ్ పోస్ట్ చేశారు.