అర్బన్ మాంక్ లుక్.. ‘వేదాళం’లో ఆ పార్ట్ కోసమేనట.. చిరు క్లారిటి
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో అభిమానులంతా ఆశ్చర్యపోయారు. అర్బన్ మాంక్ లుక్‌లో తొలిసారి చిరు అభిమానుల ముందుకు వచ్చారు. ఈ లుక్‌ని సైతం అభిమానులు బాగా ఇష్టపడ్డారు. అయితే అదెలా సాధ్యమైంది? ఫోటో షాప్‌లో చేశారా? లేదంటే నిజంగానే చిరు గుండు కొట్టించుకున్నారా? అంటూ చర్చలు మీద చర్చలు నడిచాయి. అయితే ఆ లుక్ ఎలా క్రియేట్ చేశారో వీడియోతో సహా పోస్ట్ చేసి అన్ని చర్చలకూ ఫుల్ స్టాప్ పెట్టారు.
అయితే ఈ లుక్ దేని కోసం ట్రై చేశారు? అనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. కొందరు ‘ఆచార్య’ కోసమని భావిస్తుండగా మరి కొందరు ‘వేదాళం’ మూవీ కోసమేనని భావిస్తున్నారు కానీ ఏమూవీ కోసమనే దానిలో మాత్రం క్లారిటీ అయితే లేదు. తాజాగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. ‘‘ఆ లుక్ ‘ఆచార్య’ కోసం కాదు. ‘వేదాళం’ రీమేక్ కోసం చేసిన ట్రయల్ లుక్. అయితే ఆ లుక్ విషయంలో నేను ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. చాలా మంది జనాలు ఆ లుక్‌ని రజినీకాంత్ శివాజీ లుక్‌తో పోలుస్తున్నారు’’ అని చిరు తెలిపారు.
ఇక తన అర్బన్ మాంక్ లుక్ గురించి చిరు మాట్లాడుతూ.. ‘‘ఆ మేకప్ కోసం దాదాపు గంటన్నర సమయం తీసుకుంది. ఆర్టిఫిషియల్‌గా అనిపించే మేము ప్రోస్థెటిక్ మేకప్‌ను వాడాము. కానీ న్యూ టెక్నాలజీతో ఆ లుక్‌ను దగ్గర నుంచి చూసినప్పటికీ నిజమైన గుండు లాగే కనిపించేలా సెట్ చేశాం’’ అని చిరు వెల్లడించారు. ఇక మీదట ఇలాంటి లుక్ కావాలనుకునే నటులు గుండు కొట్టించుకోవాల్సిన పని లేదని.. న్యూ టెక్నాలజీతో సెట్ చేయొచ్చని చిరు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com