రాజకీయాల్లోకి రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన చిరు...

వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి స్థానానికి ఎప్పుడూ లోటు రాలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న సమయంలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ప్రజా జీవితంలో గడిపారు. ఆ సమయంలోనే ఆయన ఎన్నో సవాళ్లను.. ప్రతి సవాళ్లనూ.. ఆరోపణలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పారు.

అనంతరం 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రంతో చిరు గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చిరు తిరిగి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిరు తాజాగా ఓ షోలో క్లారిటీ ఇచ్చారు. తెలుగు ఓటీటీ 'ఆహా'లో స్టార్‌ హీరోయిన్‌ సమంత హోస్ట్ చేస్తున్న 'సామ్‌ జామ్‌' షోలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ షోలో చిరు ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ షోలోనే తన పొలిటికల్ రీఎంట్రీపై చిరు క్లారిటీ ఇచ్చారు.

చిరంజీవి పాల్గొన్న షోని 'ఆహా' ఓటీటీ క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసింది. ఈ షోలో చిరంజీవి మాట్లాడుతూ.. పదేళ్లలో చాలా తెలుసుకున్నానని, పాలిటిక్స్‌ అసలు ఏమాత్రం తనకు సరిపడవని తెలుసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నానని తెలిపిన చిరు.. ఇకపై రాజకీయాల జోలికి పోనని తెలిపారు. అలాగే మరో జన్మంటూ ఉంటే కూడా.. అప్పుడు కూడా నటుడిగానే ఉండాలని కోరుకుంటానని తెలిపారు. మొత్తానికి చిరు మాటలతో ఇక పొలిటికల్ ఎంట్రీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదని స్పష్టమైంది.

More News

మెగా రీమేక్‌ల‌కు స‌రిపోయే హీరోలెవ‌రు..చిరంజీవి ఏమ‌న్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ‘ఆచార్య’ చిత్రీక‌ర‌ణ‌లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. అయితే సినిమాకే పరిమితం కాకుండా గ్యాప్‌లో అక్కినేని కోడ‌లు..

కిరణ్‌ అబ్బవరం ‘సెబాస్టియన్‌ పి.సి. 524’ గ్లింప్స్‌ విడుదల చేసిన లావణ్యా త్రిపాఠి

కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణివారు’తో ప్రేక్షకులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలను ఆకట్టుకున్న యువకుడు కిరణ్‌ అబ్బవరం.

‘ఆచార్య’లో పూజా హెగ్డే..!

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి త‌న 152వ చిత్రం ‘ఆచార్య’ను పూర్తి చేసే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నాడు.

నిన్నటి కంటే మెరుగ్గా రజనీకాంత్‌ ఆరోగ్యం: అపోలో వైద్యులు

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో

భారత్‌లో మార్చిలోనే ప్రవేశించిన స్ట్రెయిన్: ఐజీఐబీ వెల్లడి

కొవిడ్‌-19 మహమ్మారి క్రమక్రమంగా మ్యుటేషన్ చెందుతూ ఇబ్బందులు పెడుతూనే ఉంది.