'ఆచార్య'లో మహేశా.. చెర్రీనా.. క్లారిటీ ఇచ్చేసిన చిరు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవి.. సూపర్ హిట్ చిత్రాల, సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే సినిమాకు సంబంధించి దాదాపు అన్ని విషయాలు లీకైపోయాయి. పొరపాటున మెగాస్టార్ ‘ఆచార్య’ అని సినిమా పేరు చెప్పేయడం.. ఆ తర్వాత సినిమా నుంచి సీనియర్ నటి త్రిష తప్పుకుంటున్నట్లు ప్రకటించడం.. ఈ సినిమాలో యంగ్ మెగాస్టార్‌గా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నట్లు వార్తలు రావడం.. ఆ తర్వాత మళ్లీ రెమ్యునరేషన్ విషయంలో తేడా కొట్టిందని ఆయన తప్పుకున్నాడని మళ్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరే ఈ పాత్ర ఆగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
మహేశ్ విషయమై..
అయితే ఈ మొత్తం వ్యవహారంపై మరీ ముఖ్యంగా టైటిల్ రివీల్ చేయడం, మహేశ్ నటిస్తున్నాడా..? లేకుంటే చెర్రీ నటిస్తున్నాడా..? ఇలా అన్ని విషయాలపై తాజాగా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ క్లారిటీ ఇచ్చేశారు. తాను పొరపాటున ‘ఆచార్య’ అని టైటిల్ చెప్పేశానని చిరు నవ్వుతూ తెలిపారు. అసలు మహేశ్ పేరు ఎలా వచ్చిందో తనకు తెలియట్లేదన్నారు. అయితే.. మహేశ్ అంటే తనకు చాలా ఇష్టమని మనసులోని మాటను మెగాస్టార్ బయటపెట్టారు. అంతటితో ఆగని ఆయన.. మహేశ్‌తో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అది చాలా అద్భుతమని చెప్పారు. మహి తనకు బిడ్డలాంటి వాడన్నారు.
చెర్రీ పాత్రపై క్లారిటీ..
వాస్తవానికి మొదట్నుంచి ఈ సినిమాలో చెర్రీనే నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న చెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చెర్రీ బిజీబిజీగా ఉండటంతో ఆయనే స్వయంగా మహేశ్‌ను రెఫర్ చేశాడని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై చిరు స్పందిస్తూ.. సినిమాలో ఓ పాత్రకు చెర్రీ అయితే బాగుంటుందని కొరటాల అనుకుంటున్నాడని.. అయితే.. చెర్రీ RRRతో చరణ్ చాలా బిజీగా ఉన్నాడన్నారు. అందుకే చెర్రీ డేట్స్ ఇస్తాడా..? లేదా అనేది తెలియట్లేదన్నారు. జక్కన్న- కొరటాల ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌కు వస్తే మాత్రం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తాడని చిరు తేల్చేశారు. ఒకవేళ కుదరకపోతే పరిస్థితి ఏంటనేది..? ఎవరు నటిస్తారనేది..? మాత్రం తనకు తెలియట్లేదన్నారు.
సురేఖ కోరిక నెరవేరేనా..!
‘నేను-చెర్రీ ఇద్దరం కలిసి కంప్లీట్‌గా సినిమా చేయాలని సురేఖ (చిరు సతీమణి) కోరిక’ అనే విషయం కూడా ఈ ఇంటర్వ్యూ వేదికగా మెగాస్టార్ పంచుకున్నారు. మరి ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో..? సురేఖ కోరిక నెరవేరుతుందా..? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. ఇప్పటి వరకూ చెర్రీ సినిమాలో చిరు చేసినప్పటికీ లిటిల్ బిట్ మాత్రమే.. ఫుల్ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. అప్పట్లో వీరిద్దర్నీ కలిపి మల్టీస్టారర్ సినిమా కూడా చేయాలని అనుకుంటున్నారని.. కొందరు దర్శకులు కథలు కూడా సిద్ధం చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు వర్కవుట్ కాకపోతే మల్టీస్టారర్ అయినా సెట్ అవుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments