బీజేపీలో చేరికపై తేల్చేసిన చిరంజీవి...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్- 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న సందర్భంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ సందర్భంగా తెలుగులో ఓ ప్రముఖ దినపత్రికకు మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరికతో పాటు పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
ప్రశ్న: ‘మీరు బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇది ఎంతవరకు నిజం.. ఇంతవరకూ ఎందుకు ఖండించలేదు’ అనే ప్రశ్న ఎదురవ్వగా చిరు చాలా సింపుల్‌గా సమాధానమిచ్చేశారు.
చిరు సమాధానం: తాను ఇప్పడు ఏ పార్టీలో లేనని.. కేవలం సినిమా అనే పార్టీలో మాత్రమే ఉన్నానన్నారు. అంతేకాదు.. ఎన్నో ఏళ్ళ కల అయిన ‘సైరా’ లాంటి భారీ చిత్రం పూర్తవ్వడంతో చాలా రిలాక్స్‌గా ఉన్నానని చిరు చెప్పుకొచ్చారు. తాను బీజేపీ చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని తేల్చిచెప్పేశారు. కాగా గతంలో చిరు బీజేపీలో చేరతారని.. ఆయనే సీఎం అభ్యర్థి అని.. ఇప్పటికిప్పుడు చిరు పార్టీలో చేరితే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై చిరు క్లారిటీ ఇవ్వడంతో మోగాభిమానులు, జనసేన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments