అల్లు ఫ్యామిలీ, పవన్‌తో విబేధాలపై చిరు క్లారిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ విషయాల్లో ఎక్కువగా పుకార్లు షికార్లు చేస్తుంటాయ్. అయితే ఆ పుకార్లపై ఫ్యామిలీ నుంచి ఎవరూ రియాక్ట్ అవ్వకపోవడంతో చిత్ర విచిత్రాలుగా కథనాలు వచ్చేస్తుంటాయ్. దీంతో అసలేం జరిగిందో ఏంటో..? అనే అనుమానాలు, సందేహాలు మెగాభిమానుల్లో ఉండిపోయేవి. ఈ పుకార్లలో ఎక్కువగా.. చిరు-అల్లు అరవింద్ గొడవ జరిగిందని.. వారిద్దరూ ఎడ మొహం.. పెడ మొహంగా ఉన్నారని వార్తలు వినిపించాయి. రాజకీయాలకు రాం రాం చెప్పేసి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు గీతా ఆర్ట్స్‌కు చాన్స్ ఇవ్వకుండా సొంత బ్యానర్లో చేయడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు తమ్ముడు పవన్ కల్యాణ్‌తో విబేధాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. వీటన్నింటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసుకున్నారు చిరు.
అబ్బే.. అవన్నీ పుకార్లే..!
అల్లు అరవింద్‌కు నాకు గొడవలున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు.. అవన్నీ పుకార్లే. మా మధ్య ఎలాంటి గొడవల్లేవ్. ఆయన మా కుటుంబ సభ్యుడు. మేమిద్దరం చాలా విషయాల్లో మాట్లాడుకుంటాం. ఒకరి సలహాలు ఒకరు తీసుకుంటాం. ముఖ్యమైన విషయాల్లో అయితే కలిసి కూర్చొని చర్చించుకుంటాం. విబేధాలు అస్సలు లేవు’ అని మెగాస్టార్ తన మనసులోని మాటను ఇంటర్వ్యూ వేదికగా చెప్పేశారు. మరి దీనిపై అల్లు అరవింద్ ఎలా రియాక్ట్ అవుతారో..!
పవన్ విషయంలో..!
తమ్ముడు పవన్‌తో విబేధాలు ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. గతంలో నా తమ్ముడు కూడా ఈ విషయంపై స్పందించాడు. మా మధ్య ఎలాంటి విబేధాల్లేవ్. ఇలాంటి ఆరోపణలు ఎవరు చేస్తున్నారో..? ఎందుకు చేస్తున్నారో..? అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజానికి పుకార్లను నేను పెద్దగా పట్టించుకోను.. అందుకే రియాక్ట్ అవ్వను’ అని మెగాస్టార్ తేల్చిచెప్పేశారు.
ఫైనల్‌గా ఇన్ని రోజులుగా మెగాభిమానుల్లో నెలకొన్న అనుమానాలు, సందేహాలన్నీ క్లియర్ అయ్యాయన్న మాట. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో చిరు అడుగుపెట్టిన తర్వాత యమా యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలోనూ టాలీవుడ్లో పెద్దన్న పాత్ర పోషిస్తూ సినీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com