నిహారిక పెళ్లి పెద్ద మెగాస్టారే.. వరుడి తండ్రి ముందు చిరు ప్రపోజల్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా వారింట పెళ్లి అనగానే.. వరుడెవరు? వరుడి కుటుంబానికి.. మెగా కుటుంబంతో ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ వరుణ్ని ఎవరు వెదికి తెచ్చారు వంటి ప్రశ్నలెన్నింటికో సమాధానాలు తెలుసుకోవాలని ఎవరికుండదు? మీ కోసమే ఈ కథనం..
మొదట్లో మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయంలో రూమర్స్.. ఆ హీరోతో పెళ్లి.. ఈ హీరోతో పెళ్లంటూ నెట్టింట ఊహాగానాల పరంపర నడించింది. అదేమీ లేదంటూ మెగా ఫ్యామిలీ మొత్తుకున్నాక ఆ రూమర్స్‌కి తెరపడింది. ఆ తరువాత మెగా బ్రదర్ నాగబాబే తన కుమార్తెకు వివాహం చేయబోతున్నామని.. వరుణ్ని వెతుకుతున్నామంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సడెన్‌గా నిహారిక ఇన్‌స్టా వేదికగా పలు సస్పెన్స్‌ల నడుమ తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పెళ్లి పెద్ద మన మెగాస్టార్ చిరంజీవియే కావడం విశేషం.
వరుడు చైతన్య తల్లి పద్మ తండ్రిగారైన గుణ వెంకటరత్నం.. చిరు తండ్రిగారైన కొణిదెల వెంకట రావు మంచి స్నేహితులు. పద్మ భర్త ప్రభాకర్‌రావుతో చిరుకి మంచి స్నేహం ఏర్పడింది. దీంతో తరువాత కూడా ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు నడుస్తున్నాయి. ఇటీవల ప్రభాకర్‌రావు తన కుమారుడు చైతన్యకు వివాహం చేయాలనుకుంటున్నానని వధువు కోసం వెదుకుతున్నామని చిరుతో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో చిరు తన తమ్ముని కుమార్తె నిహారికను మీ ఇంటి కోడల్ని చేసుకోమంటూ ప్రభాకర్‌రావు ముందు ప్రపోజల్ ఉంచినట్టు సమాచారం. స్నేహం కాస్తా బంధుత్వంగా మారడాన్ని హర్షించిన ప్రభాకర్‌రావు వెంటనే ఒప్పేసుకున్నారు. ఇలా చిరు కొణిదెల ఇంటి పెద్దగా మాత్రమే కాకుండా నిహారిక పెళ్లి పెద్దగా కూడా మారిపోయారు. ఇక పెళ్లి బాధ్యతను కూడా చిరుయే స్వీకరించనున్నారని టాక్. త్వరలోనే ఈ జంటకు నిశ్చితార్థం జరగనుంది. పెళ్లి మాత్రం కరోనా కారణంగా వచ్చే ఏడాది నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments