#MEGA154: ఊర నాటు లుక్‌లో మాస్ మూల విరాట్ .. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్‌లతో జోరు మీదున్నారు. 70కి చేరువవుతున్నా కుర్రాళ్ల కంటే స్పీడుగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ను రెడీ చేశారు చిరు. తాజాగా తన 154వ సినిమాకు సంబంధించి క్రేజ్ అప్డేట్ బయటకు వచ్చింది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. మూవీ యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా బాబీ.. చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు.
ఇందులో చిరంజీవి ఊర మాస్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #MEGA154 వర్కింగ్ టైటిల్‌తో తీస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్.. జాలరిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'వాల్తేరు వీరయ్య' టైటిల్ పరిశీలనలో ఉంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ , నటీనటులు, ఇతర సాంకేతిక వర్గానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది.
ఇదిలావుంటే చిరంజీవి సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న 'గాడ్ ఫాదర్' సెట్స్‌పై ఉంది. వీటితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్లను చిరు పట్టాలెక్కిస్తున్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com