#MEGA154: ఊర నాటు లుక్‌లో మాస్ మూల విరాట్ .. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే

మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్‌లతో జోరు మీదున్నారు. 70కి చేరువవుతున్నా కుర్రాళ్ల కంటే స్పీడుగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ను రెడీ చేశారు చిరు. తాజాగా తన 154వ సినిమాకు సంబంధించి క్రేజ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. మూవీ యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా బాబీ.. చిరు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.

ఇందులో చిరంజీవి ఊర మాస్‌ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #MEGA154 వర్కింగ్ టైటిల్తో తీస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్.. జాలరిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'వాల్తేరు వీరయ్య' టైటిల్ పరిశీలనలో ఉంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ , నటీనటులు, ఇతర సాంకేతిక వర్గానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది.

ఇదిలావుంటే చిరంజీవి సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న 'గాడ్‌ ఫాదర్‌' సెట్స్‌పై ఉంది. వీటితో పాటు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్‌లను చిరు పట్టాలెక్కిస్తున్నారు
 

More News

"ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే" : శ్యామ్‌ సింగరాయ్‌ లిరికల్‌ సాంగ్‌ అదరహో

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో వెంకట బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లు.

రామ్ చరణ్ రిలీజ్ చేసిన సుమ 'జయమ్మ పంచాయితీ' ఫస్ట్ లుక్‌

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోత్నారు. విలేజ్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

లాంఛనంగా ప్రారంభ‌మైన మెగాస్టార్ చిరంజీవి - బాబీ చిత్రం

మెగాస్టార్ 154 వ చిత్రాన్ని టాలీవుడ్ అగ్రగామి నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు.

"అన్నాత్తే రిలీజ్".. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్, అది రజనీ అంటే

రజనీకాంత్.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తన కృషి, పట్టుదల, కార్యదీక్షతో సాధారణ కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం.

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియాంకను కిస్ చేసిన జెస్సీ.. పింకీ- మానస్‌ల పబ్లిక్‌ రోమాన్స్, కొత్త కెప్టెన్‌గా యానీ మాస్టర్

బిగ్‌బాస్ 5 తెలుగులో భాగంగా ఈ రోజు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఓ వైపు మానస్‌- ప్రియాంకల మధ్య లవ్‌ స్టోరీ, మరోవైపు షణ్ముఖ్‌, సిరిల మధ్య ఫ్రెండ్‌షిప్‌ విభేదాలతో హౌస్ హీటెక్కింది.