చిరు, బాబీ కాంబోలో మల్టీస్టారర్.. మరో హీరో ఎవరంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
‘బలుపు’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ. ఆ తరువాత పవన్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా చేసినప్పటికీ బాబీ అనగానే గుర్తొచ్చేది మాత్రం ‘జై లవకుశ’ సినిమానే. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రిబుల్ యాక్షన్ చేయించి మంచి హిట్ కొట్టారు. ఆ తరువాత ‘వెంకీమామ’ అనే మల్టీ స్టారర్‌ని తీసి హిట్ కొట్టిన బాబీ ఇప్పుడో అదిరిపోయే ఛాన్స్ కొట్టేశారని టాక్. ఈ సారి కూడా బాబీ మల్టీస్టారర్ మూవీనే తెరకెక్కించాలని అనుకుంటున్నట్టు సమాచారం. అయితే అది మరెవరితోనో కాదు.. మెగాస్టార్ చిరంజీవితో..
మంచి ఎంటర్టైన్మెంట్తో సాగే కథను రాసుకున్న బాబీ.. స్టోరీ లైన్‌ని చిరుకి కూడా వినిపించారట. దీనికి చిరు కూడా పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమవుతోందట. ఈ మల్టీస్టారర్ మూవీలో మరో హీరోగా సాయి తేజ్ నటించనున్నాడని టాక్. అంతా ఓకే అయితే ‘ఆచార్య’ తరువాత సెట్స్‌పైకి వచ్చేది ఈ సినిమాయేనని టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఈ లోపు బాబీ కూడా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తాడని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com