Chiranjeevi:నాన్నా చరణ్ .. నిన్ను చూసి గర్వంగా వుంది : చెర్రీ బర్త్‌డే నాడు చిరు ఎమోషనల్ పోస్ట్
- IndiaGlitz, [Monday,March 27 2023]
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్. అంతేకాదు ... సామాజిక సేవలోనూ చిరంజీవికి ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటున్నారు. తండ్రి అడుగుజాడల్లో తన కెరీర్‌ను జాగ్రత్తగా నిర్మించుకుంటూ వస్తున్న ఆయన.. మెగా పవర్ స్టార్‌గా ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయారు. ఇంతకంటే ఒక తండ్రికి పుత్రోత్సాహం ఏముంటుంది. కొడుకును చూసి తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతానని పలుమార్లు వేదికలపై చెప్పారు చిరు.
మెగాస్టార్ ఇంట్లో అన్నీ శుభాలే :
ఇక ఈ ఏడాది మెగాస్టార్ ఇంట అన్ని శుభాలే జరుగుతున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత చరణ్ తండ్రి కాబోతున్నాడని ప్రకటించడం.. ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావడం, గ్లోబల్ స్టార్‌గా చరణ్‌కు గుర్తింపు రావడం, శంకర్‌తో సినిమా తీయాలన్న తన కలను చరణ్ తీరుస్తుండటం వంటి అంశాలతో చిరంజీవి ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. సరిగ్గా ఇదే సమయంలో రామ్ చరణ్ పుట్టినరోజు రావడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తన కుమారుడికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు చిరు. ‘‘నాన్న రామ్‌చరణ్ నిన్ను చూసి గర్వంగా వుంది.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ విషెస్ చెప్పారు. ఈ మేరకు చరణ్‌కు అప్యాయంగా ముద్దు పెడుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు.
గేమ్ చేంజర్‌గా రానున్న ఆర్‌సీ 15 :
ఇదిలావుండగా.. తమిళ దర్శక దిగ్గజం శంకర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను ఈ రోజు చరణ్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు మేకర్స్. దీనికి ‘గేమ్ చేంజర్’ అనే పేరును ఖరారు చేశారు మేకర్స్. ఈ మేరకు టైటిల్ రివీల్ వీడియోను విడుదల చేశారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. టైటిల్ సూపర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
170 కోట్ల భారీ బడ్జెట్‌తో గేమ్ చేంజర్ :
కాగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Proud of you Nanna.. @AlwaysRamCharan
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2023
Happy Birthday!! 🎉💐 pic.twitter.com/JnDXc50N8W