మెగాస్టార్ ఫ్యాన్స్‌కి శివరాత్రి కానుక.. ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న సినిమా ‘‘భోళా శంకర్’’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై... రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంక‌ర నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మహానటి ఫేం కీర్తి సురేష్ ఆయనకు చెల్లెలిగా నటిస్తున్నారు. రఘుబాబు, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా.. డుడ్లీ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అజిత్ హీరోగా తమిళంలో వేదాళంకు రీమేక్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌లను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో స్టైల్‌గా జీపు మీద కూర్చుని కీ చైన్‌ను తిప్పుతూ క‌నిపిస్తున్నారు చిరంజీవి. చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా మాస్‌లుక్‌, మాస్ పాత్ర‌లో మెగాస్టార్ కనిపించబోతున్నారు. ఆయనను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ విధంగానే ‘భోళా శంకర్’ ను తెరకెక్కిస్తున్నారు మెహర్ రమేష్.

ఇక చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోహన రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌తో పాటు బాబీ డైరెక్షన్‌లో ‘‘వాల్తేర్ వీరయ్య’’, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మెగాస్టార్. ఇక ఏప్రిల్ 29న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిరంజీవి నటించిన ఆచార్యను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

More News

'సెబాస్టియన్‌ పిసి524’ ట్రైలర్  విడుదల చేసిన సెన్సేనల్ హీరో విజయదేవరకొండ

జ్యోవిత సినిమాస్‌ పతాకంపై కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నివేక్ష (నమ్రతా దరేకర్‌) నటీనటులుగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కోసం అపూర్వమైన ఆరంభాన్ని అందించిన బిగ్‌బాస్‌ అభిమానులు

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కోసం అపూర్వమైన ఆరంభాన్ని అందించిన బిగ్&

లవ్, కామెడీ, సెంటిమెంట్‌ల కలబోత: ఆకట్టుకుంటోన్న ‘ సెబాస్టియన్ పీసీ 524 ’ ట్రైలర్

వినూత్నమైన కథలతో దూసుకెళ్తున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం.

చిరు వ్యాపారులకు ఆసరా.. 5 లక్షల మంది ఖాతాల్లోకి ‘‘జగనన్న తోడు’’ డబ్బులు

రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల

విద్యార్ధుల తరలింపుపై మోడీ ఫోకస్.. ఉక్రెయిన్ బోర్డర్‌‌కు నలుగు కేంద్ర మంత్రులు

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అన్ని దేశాలు తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.