వేసవి బరిలో చిరు, బాలయ్య..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. పలు సందర్భాల్లో ఈ అగ్ర కథానాయకులు పోటీ పడితే ఒక సందర్భంలో ఒకరిది పైచేయి అయితే, మరో సందర్భంలో మరొకరిది పైచేయి అవుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద ఫైట్ చేసుకోబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రీస్టార్ట్ కానుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయబోతున్నారని అంటున్నారు.
అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం కూడా వేసవిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇద్దరూ అగ్ర హీరోలు.. ఎవరి ఫ్యాన్ బేస్ వారికుంది. రెండు సినిమాలను డైరెక్ట్ చేస్తుంది స్టార్ డైరెక్టర్సే.రెండు సినిమాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్సే వర్క్ చేస్తున్నారు. రెండు సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి వేసవి పోరులో ఎవరు విజేతగా నిలుస్తారనేది తెలియాలంటే వెయిటింగ్ తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com