వేస‌వి బ‌రిలో చిరు, బాల‌య్య‌..!

మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డబోతున్నారు. ప‌లు సంద‌ర్భాల్లో ఈ అగ్ర క‌థానాయ‌కులు పోటీ ప‌డితే ఒక సంద‌ర్భంలో ఒక‌రిది పైచేయి అయితే, మ‌రో సంద‌ర్భంలో మ‌రొక‌రిది పైచేయి అవుతూ వ‌చ్చింది. ఇప్పుడు మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద ఫైట్ చేసుకోబోతున్నార‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. స‌మాచారం మేర‌కు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. క‌రోనా కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే రీస్టార్ట్ కానుంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల చేయ‌బోతున్నార‌ని అంటున్నారు.

అలాగే నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం కూడా వేస‌విలోనే విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. ఇద్ద‌రూ అగ్ర హీరోలు.. ఎవ‌రి ఫ్యాన్ బేస్ వారికుంది. రెండు సినిమాల‌ను డైరెక్ట్ చేస్తుంది స్టార్ డైరెక్ట‌ర్సే.రెండు సినిమాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్సే వర్క్ చేస్తున్నారు. రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. మ‌రి వేస‌వి పోరులో ఎవ‌రు విజేత‌గా నిలుస్తార‌నేది తెలియాలంటే వెయిటింగ్ త‌ప్ప‌దు.

More News

ర‌కుల్ నోటీసుల విష‌యంలో హై డ్రామా..!

సినీ ప‌రిశ్ర‌మ‌కు డ్ర‌గ్ మాఫియాతో సంబంధాలున్నట్లు నార్కోటిక్ విచార‌ణ‌లో వెల్ల‌డి కావ‌డంతో అధికారులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. అందులో భాగంగా డ్ర‌గ్ మాఫియాతో డీలింగ్ ఉన్న‌ట్లు తెలిసిన

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనాతో మృతి

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

ఇవాళ్టి బీభత్సాన్ని చెప్పలేం.. చూసి తీరాల్సిందే..

రోబోల కిడ్నాప్ స్కెచ్‌తో షో స్టార్ట్ అయింది. అభి స్కెచ్ పర్ఫెక్ట్‌గా గీశాడు. ముందే రిహార్సల్ కూడా వేయించాడు. నిజానికి దేవి చనిపోయింది. ఆటలో ఇన్వాల్వ్ అవకూడదు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో మెగా హీరో

కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన షూటింగ్‌లన్నీ క్రమక్రమంగా తిరిగి ప్రారంభమవుతున్నాయి. దీంతో హీరోలంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.

నానితో త్రివిక్ర‌మ్ అదే కార‌ణ‌మా..?

మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌డానికి హీరోలంద‌రూ ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠ‌పురుమ‌లో చిత్రంతో భారీ హిట్‌ను