18వ సారి పోటీపడుతున్న చిరంజీవి - బాలకృష్ణ..!
- IndiaGlitz, [Thursday,January 05 2017]
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్నితెరకెక్కించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇదిలా ఉంటే...నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణ చిత్రాలు రిలీజ్ అవుతుండడం, ఈ రెండు చిత్రాలు చిరు, బాలయ్య కెరీర్ లో మైలు రాయిగా నిలిచే చిత్రాలు కావడంతో ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. అయితే...చిరు, బాలయ్య గతంలో 17 సార్లు పోటీపడ్డారు. 18వ సారి ఇప్పుడు పోటీపడుతున్నారు.
ఇప్పటి వరకు చిరు, బాలయ్య పోటీపడిన చిత్రాల వివరాలు మీకోసం...!
మంగమ్మగారి మనవడు – ఇంటిగుట్టు - 1984
కథానాయకుడు – రుస్తుం - 1984
ఆత్మబలం – చట్టంతో పోరాటం - 1985
నిప్పులాంటి మనిషి – కొండవీటి రాజా - 1986
అపూర్వ సహోదరులు – రాక్షసుడు - 1986
ముద్దుల కృష్ణయ్య - మగధీరుడు -1986
భార్గవ రాముడు – దొంగ మొగుడు - 1987
రాము – పసివాడి ప్రాణం - 1987
ఇన్ స్పెక్టర్ ప్రతాప్ – మంచిదొంగ - 1988
రాముడు భీముడు – యుద్దభూమి - 1988
పెద్దన్నయ్య – హిట్లర్ - 1997
బావగారు బాగున్నారా - యువరత్న రాణా - 1998సమరసింహారెడ్డి - స్నేహంకోసం - 1999
వంశోద్ధారకుడు – అన్నయ్య - 2000
వంశోద్ధారకుడు – అన్నయ్య - 2000
నరసింహ నాయుడు – మృగరాజు - 2001
భలేవాడివి బాసు – శ్రీ మంజునాథ - 2001
లక్ష్మీ నరసింహ – అంజి - 2004
గౌతమి పుత్ర శాతకర్ణి – ఖైదీ నంబర్ 150 - 2017
ఈ ఆసక్తికర పోటీలో రెండు చిత్రాలు సంచలన విజయాలు సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ఖైదీ నెం 150 & గౌతమీపుత్ర శాతకర్ణి టీమ్స్..!