‘సామ్ జామ్’కు చిరు.. బాస్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి స్టైల్, నడక అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మెగాస్టార్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్స్ అన్నీ ఇటీవల తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘ఆచార్య షూటింగ్ కూడా డేట్ ఫిక్స్ చేసుకుని మెగాస్టార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆగిపోయిన విషయం తెలిసిందే. కాగా.. టెస్టింగ్ కిట్‌లో లోపం వల్లే పాజిటివ్ వచ్చిందని నిర్ధారణ కావడంతో చిరు తిరిగి యాక్టివ్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే చిరు అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్ చేస్తున్న ‘సామ్‌జామ్’ షూటింగ్లో చిరు సందడి చేశారు. ఈ నేపథ్యంలో తీసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌ను చూసిన అభిమానులు ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. చిరు ఇటీవల దీపావళి పండుగను పురస్కరించుకుని తన సతీమణి సురేఖతో కలిసి వెళ్లి దిగ్గజ దర్శకులు కె. విశ్వనాథ్‌ను కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. కాగా.. ‘ఆచార్య’ సెట్లో చిరు ఈ నెల 20 అడుగు పెడతారని టాక్ నడుస్తోంది కానీ అధికారిక సమాచారమైతే లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments