'నా పేరు సూర్య' చిత్రం షూటింగ్ సెట్లో మెగాస్టార్ చిరంజీవి

  • IndiaGlitz, [Sunday,April 15 2018]

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ చిత్రం లోని సాంగ్ షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ స్టూడియో లో వేసిన గ్రాండ్ సెట్లో జరుగుతోంది. ఈ సాంగ్ సెట్లో కి మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. బన్నీ డాన్స్ చేస్తున్నంత సేపు చిరు ఎంజాయ్ చేశారు. సాంగ్ తనకు బాగా నచ్చిందని మెచ్చుకున్నారు. చిత్ర యూనిట్ తో కలిసి సినిమా విశేషాల్ని అడిగి తెలుసుకున్నారు.  మెగాస్టార్ చిరంజివి గారితో పాటు గీతాఆర్ట్స్ అథినేత అల్లు అర‌వింద్ గారు కూడా విచ్చేశారు.

మరోవైపు బ్యూటిఫుల్ లవ్ అంటూ సాగే పాటను ఈ మధ్యే నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీష శ్రీధర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూత్ ఈ సాంగ్ కి బాగా కనెక్ట్ అయ్యారు.  ఈ నెల 22న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేస్తున్నారు. 29 న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

More News

బాల‌య్య‌, క‌ళ్యాణ్ సినిమా ఎప్పుడంటే..

న‌టసింహ నంద‌మూరి బాలకృష్ణ.. ‘జై సింహా’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నారు.

'నా కథలో నేను' ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేసిన స్టార్‌ రైటర్‌ వి.విజయేంద్ర ప్రసాద్‌

సాంబశివ హీరోగా సంతోషి శర్మ హీరోయిన్‌గా జి.ఎస్‌.కె. ప్రొడక్షన్‌ పతాకంపై శివ ప్రసాద్‌ గ్రంధే స్వీయ దర్శకత్వంలో

ఏప్రిల్ 17 నుండి రెండవ షెడ్యూల్ లో 'నివాసి'

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంలో న‌టించి అంద‌రి హ్రుద‌యాల్లో న‌టుడిగా మంచి స్థానం సంపాయించిన శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా,

'శ్రీ‌నివాస క‌ళ్యాణం'తో అయినా బ్రేక్ అవుతుందా?

యువ కథానాయకుడు నితిన్‌కు పాత టైటిల్స్‌పైన మక్కువ ఎక్కువ.

అప్పుడు రీమేక్‌.. ఇప్పుడు రీమిక్స్‌

యువ కథానాయకుడు నాగ చైతన్య కథానాయకుడిగా, చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘సవ్యసాచి’.